Description
స్పటిక మాల ధరించడం వల్ల శారీరక, మానసిక ప్రశాంతత, ఒత్తిడి తగ్గింపు, శరీర ఉష్ణోగ్రత నియంత్రణ వంటి ప్రయోజనాలు కలుగుతాయి . ఈ మాల ధారణా లేదా వినియోగం ధ్యానానికి, చైతన్య శుద్ధికి సహాయపడుతుంది చంద్ర శుక్ర గ్రహ దోష నివారణకు కూడా ఉపయోగపడుతుంది .
ఈ మాల ధారణ వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగు అవుతుంది అని ఆయుర్వేదం తెలియజేస్తోంది . శారీరక ఒత్తిడి, మానసిక ఆందోళనలను తగ్గించి, మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది .
ఇది దుష్ట శక్తులనుండి సాధారణ రక్షణ కల్పిస్తుంది అంటే ద్రుష్టి దోషాలు తగ్గించడం వంటివి , ప్రతికూల శక్తుల నుండి రక్షణ కల్పిస్తుంది.
జపానికి, ధ్యానానికి ఒక మంచి సాధనంగా ఈ శుద్ధ స్ఫటిక మాల ఉపయోగపడుతుంది, ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడుతుంది.
శుక్ర గ్రహ దోషం ఉన్నవారు, శని గ్రహ ప్రభావం ఉన్నవారు దీనిని ధరిస్తే మంచిదని, శని దోష తీవ్రత తగ్గుతుందని జ్యోతిష శాస్త్రం తెలియజేస్తోంది .
ఈ మాలను అందరు అన్ని వయస్సుల వారూ పురుషులు , స్త్రీలు కూడా ధరించవచ్చు.
స్పటిక మాలను ఒకరిది మరొకరు ధరించకూడదు. గర్భిణీ స్త్రీలు, సంతానార్ధులు ఈ మాలను ధరించకూడదు .
ఈ పూసలు సహజంగా స్పర్శకు చల్లగా మరియు చూడటానికి పారదర్శకంగా ఉంటాయి, సాధకులు శుద్ధ విద్యలు అంటే సాత్విక విద్యల సాధనల్లో జప మాలగా వినియోగిస్తారు . ఇక అందరు ఈ మాలను శారీరక వేడిమి నియంత్రణకు మనో నిశ్చలతకు ధరిస్తారు . ధ్యాన సాధన ( మెడిటేషన్ ) చేసే వారికి కూడా ఈ మాల ధారణ మంచి ఫలితాలను అందిస్తుంది . అయ్యప్ప , భవానీ వంటి మండల దీక్షలు చేసేవారు ఈ శుద్ధ స్ఫటిక మాల ధరించి దీక్షలు చేయడం ఉత్తమం . శుద్ధ స్ఫటిక మాల ను పోలిన గాజు పూసల మాలలు ప్రస్తుతం చలామణి లో ఉన్నాయి నమ్మకమైన సంస్థల నుండి తీసుకోవడం ఉత్తమం అని గ్రహించగలరు . ఈ స్ఫటిక మాల లోపల దారంతో తయారీ అయివస్తుంది . మీరు ఒకవేళ ఈ మాలను తీసుకున్నట్లయితే ముందుగా మాలను రాగి లేదా వెండితో మాలగా చుట్టించుకుని ఉపయోగించడం ఉత్తమం . మాల తయారీలో ఉపయోగించిన దారం దీర్ఘకాలం మన్నదు అని గ్రహించగలరు .
ఈ శుద్ధ స్ఫటిక మాల 108 పూసలతో పాటు ఒక గురు పూసను కలిగి ఉంటుంది. ప్రతి పూస మృదువైనది, గుండ్రంగా ఉంటుంది మరియు సహజ నిర్మాణాలను బట్టి పూర్తిగా పారదర్శకంగా లేదా కొద్దిగా మేఘావృతంగా ఉంటుంది. దీనిని ఆధ్యాత్మిక ఆభరణంగా కూడా ధరించవచ్చు. సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున ఈ శుద్ధ స్ఫటిక మాల 9 రోజుల ప్రోక్షణ సంస్కారం వారణాసిలో పూర్తి చేసి మీకు అందించడం జరుగుతోంది .








Reviews
There are no reviews yet