Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- | Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- |
Previous
Previous Product Image

KARUNGALI MAALA

Price range: ₹800.00 through ₹1,000.00
Next

RUDRAKSHA MAALA SET (8MM & 6MM)

Original price was: ₹1,200.00.Current price is: ₹1,000.00.
Next Product Image

TULASI MAALA POLISHED ROUND SHAPE

Original price was: ₹700.00.Current price is: ₹299.00.

Tulasi Mala: స్త్రీలకు మంగళప్రదమైన ఫలితాలను ఒసగే మాలా రాజం తులసి. కేవలం స్త్రీలు మాత్రమే కాకుండా ఈ మాలను పురుషులు, పిల్లలు కూడా ధరించవచ్చు. శుద్ధ విద్యల జపానికైనా, సాత్విక జీవన విధానంలో నిత్య ధారణకైనా ఈ మాలను వినియోగించుకోవచ్చు. మహా లక్ష్మి కి శ్రీమహా విష్ణువుకీ అత్యంత ప్రీతిపాత్రమైన తులసి మాల వైష్ణవ సంప్రదాయంలో విశేష ప్రాచుర్యం కలిగినది. మంత్రశాస్త్రంలో ఏ శుధ్ధవిద్యా సాధనకైనా తులసి మాల వినియోగం ఉత్తమంగా చెప్పబడినది. ఏ ఉపకరణాన్ని సాధనామార్గంలో వినియోగించాలన్నా ఆ ఉపకరణానికి సంస్కారం తప్పనిసరి అని గుర్తించండి….సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున ఈ తులసి మాలకు 11 సార్లు శ్రీసూక్తం తో సంస్కారం చేయబడినది. ఇది మంగళప్రదమైనది

Description

కంఠానికి ధరించిన మాల జపానికి పనికిరాదు అనే సూత్రం ఈ తులసి మాలకు వర్తించదు. మనం చేసే జపం వల్ల మాలకు పవిత్రత కలుగుతుంది కనుక సంస్కారం అవసరం లేదు అని కొందరి వ్యంగ వాదన.. ఒక ద్రవ్యం ఒక దైవిక కైంకర్యానికి వినియోగించేముందు ఆ ద్రవ్యాన్ని సంస్కరించి మాత్రమే వినియోగించాలి. సింహీ అపరాజితా మహామంత్రాలయం తరఫున సాధకులకు ధారణ మరియూ జప వినియోగాలకు సహజ తులసి మాలలను 108 సార్లు శ్రీసూక్త పారాయణతో  తో సంస్కారం చేసి అందుబాటులోకి తీసుకొచ్చినది. ఈ మాలలు పూర్తిగా సహజ సిద్ధమైనవి ( పోలిష్ చేయనివి ) మరియూ సంపూర్ణ సంస్కారం ఒసగబడినవి. ప్రామాణిక విధులు అనుసరించి ఈ తులసి మాల సంస్కారంలో పంచకవ్యములతో మార్జన నిర్వర్తించబడినది. మాలలను పూర్తిగా 3 రాత్రులు పంచకవ్యాలలో నానబెట్టినట్లైతే వినియోగంలో అతి కొద్దికాలానికి అని పెరిగిపోతాయి (తెగిపోతాయి) కనుక మాలా సంస్కారం లో పంచకవ్యాలను మార్జనకు పరిమితం చేయడం జరిగింది. ఈ తులసి మాల వినియోగం వల్ల సాధన, మానసిక స్థితి ప్రశాంతంగా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. 8సంవత్సరాలు ప్రవేశించినవారి లగాయతు ఏ వయస్కులు అయినా ఈ తులసి మాలను ధరించవచ్చు లేదా వినియోగించవచ్చు. తులసి మాల ధారణ చాలా ప్రశాంతతతో కూడిన జీవనస్థితి వర్చస్సును ప్రసాదిస్తుంది. ఈమాల బుధగ్రహ పీడను దోషాలను కూడా నియంత్రిస్తుంది. మంచి మరియూ మానసిక ప్రశాంతతనూ ఈ రుద్రాక్ష మారి ప్రసాదిస్తుంది. సాధనామార్గంలో ఉన్న స్త్రీలు ఈ తులసి మాల నిత్యం ధరించడం, వినియోగించడం వల్ల సాధన సవ్యంగా కొనసాగించుకునే అవకాశం లభిస్తుంది. మానసికోన్నతిని ప్రసాదించే ఈ తులసి మాల పురుషసూక్త విష్ణు సహస్రనామ పారాయణా యుక్తంగా మహావిష్ణు ఆరాధనతో సిద్ధపరచబడుతోంది ఈ తులసి మాల నిత్యం ధరించవచ్చు. పురుషులు నెలంతా మరియూ స్త్రీలు నెలసరి తరువాత 21 రోజులు నిస్సందేహంగా ధరించచ్చు.. స్త్రీలు నెలసరి రోజుల్లో తులసి మాల ధరించకూడదు. ముట్టుకోరాదు, ఈ మాల ధరించి ఉండగా మద్య, మాంసములు స్వీకరించకూడదు. మెరుగైన ఫలితాలకై తులసి మాల ధరించేటపుడు నమో నారాయణాయ అని జపిస్తూ ధరించడం ఉత్తమం. ప్రయాణ అసౌచం లేకుండా ఈతులసిమాల సంస్కరంచి మీకు అందించబడుతోంది.

Additional information

Weight 100 g

Reviews

There are no reviews yet

Add a review
Currently, we are not accepting new reviews