1ST SCROOL
2 scroling
3rd scroling
4th scrooling
previous arrow
next arrow

సింహీ అపరాజితా మహా మంత్రాలయం

సింహీ అపరాజితా మహా మంత్రాలయం అనేది ప్రామాణిక మంత్రశాస్త్రములో శ్రీక్రమం అనే సన్మార్గ విధానాలను అనుభవజ్ఞులు సూచించిన విధంగా నేర్పే ఒక పాఠశాల వంటిది. ఇది శాస్త్రం యొక్క ఔన్నత్యం మరియు విలువలను రక్షించడానికి స్థాపించబడిన పీఠం. ఇందులో కుల, వయో, లింగ భేదాలు లేవు. శాస్త్ర ప్రవేశం మరియూ సాధనల వల్ల శారీరక మానసిక పరిపక్వత సాధించి జీవితంలో ఉన్నత విలువలతో ప్రవర్తించే లక్షణాలను అభ్యసింపజేస్తుంది. ఇది ఒక రక్షణా వ్యవస్థ లాంటి విభాగం కనుక ఈ సాధనల ద్వారా ఆధ్యాత్మిక అభివృద్ధితో పాటు మనోధైర్యం పెంపొందుతుంది.

మా తత్వం:

సాధనా అభిలాష కలిగిన వారిని ప్రోత్సహించి, శాస్త్ర ప్రవేశానికి సరైన మార్గాన్ని ప్రతిపాదించి,
మంత్ర శాస్త్ర ప్రయాణం లో వారికి సహకారంగా వెన్నంటి ఉండి, ఉపదేశం ఇచ్చేసి వదిలేయకుండా వారికి కలిగిన సందేహాలను నివృత్తి చేస్తూ నిజమైన శాస్త్ర విలువలు విద్యార్ధులకు అందించాలనేది మా తత్వం. 

మా లక్ష్యం:

కొందరు ధనం కోసం, స్వార్ధం కోసం శాస్త్రం యొక్క రూపు రేఖలు మార్చేస్తూ శాస్త్ర ఉన్నతిని దిగజారుస్తున్న ప్రస్తుత రోజుల్లో…. శాస్త్ర సారం, నిజ రూపం, ఔన్నత్యం అందరికీ తెలియజేసి అందులోకి ప్రవేశించి సాధించాలనే తపన కలిగిన వారికి సరైన మార్గ దర్శనం చేస్తూ, సాధనా సమర్ధత కలిగిన వారిని ప్రోత్సహించడం.  తద్వారా భావి తరాలకు ఈ శాస్త్ర సారం అందించడం మా లక్ష్యం.

సింహీ అపరాజితా మహా మంత్రాలయం లో ప్రామాణిక మంత్రశాస్త్ర విధులు పూర్వ స సంప్రదాయాన్ని అనుసరించి నేర్పించబడతాయి.
ఈ విధానం సర్వత్రా ఆమోదయోగ్యమైనది మరియూ ప్రామాణికమైనది. ఈ విధానం లో శాస్త్ర అభ్యాసం చేసినవారు సరైన సాధకుడిగా గుర్తించబడతారు. సాధకులు మంత్రశాస్త్ర శ్రీక్రమ సాధనా పద్ధతులు ఈ మార్గం లో సులభంగా నేర్చుకోవచ్చు.

మా మంత్రాలయంలో అనుభవజ్ఞులైన పండితులు ఉన్నారు, వారు మీకు మార్గదర్శనం అందిస్తారు. మా పండితులు మంత్రశాస్త్రంలో లోతుగా పరిజ్ఞానం కలిగి ఉన్నారు మరియు మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ మంత్ర శాస్త్ర అభ్యాస విధానం లోకి ప్రవేశించిన ప్రతీ విద్యార్ధికీ సాధనా మార్గం లో వారికి కలిగే ప్రతీ సందేహాన్నీ ప్రత్యక్షంగా శ్రీ కమలానందనాధులవారే నివృత్తి చేస్తూ సాధనా మార్గాన్ని సుగమనపరుస్తారు. ప్రతీ విద్యార్ధీ ఆధ్యాత్మిక సాధనాభివృద్ధికీ అవసరమైన సంపూర్ణ మద్దతు మరియూ ప్రోత్సాహాన్ని పీఠం అందిస్తుంది.

మా మంత్రాలయ ప్రత్యేకతలు

సింహీ అపరాజితా మహా మంత్రాలయం మంత్రశాస్త్ర ఔన్నత్యాన్ని ప్రామాణికంగా క్రమ పద్దతిలో అనుసరిస్తూ ఆచరింపజేసే ఒక వ్యవస్థ. శాస్త్రంలో నిజంగా తెలియజేసిన పద్దతులు అభ్యసింపజేయడం, ఆచరింపజేయడం తద్వారా శాస్త్ర పురోగతి ప్రాప్తింపజేయడం ఈ విభాగ ప్రత్యేకత . ఇక్కడ కుల, వర్ణ, లింగ భేదాలు లేవు. సర్వ సమాన ధోరణి ఈ విభాగం కలిగిఉంది.

మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మేము మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము

మంత్రశాస్త్ర సాధన ద్వారా ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించాలనుకుంటున్నారా? సింహీ అపరాజితా మహా మంత్రాలయంలో మా అనుభవజ్ఞులైన పండితులతో సంప్రదించండి. మేము మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీకు మార్గదర్శనం అందించడానికి సిద్ధంగా ఉన్నాము.

సాధన సామగ్రి

సింహీ అపరాజితా మహా మంత్రాలయం గ్యాలరీ

సాధకుల సాక్ష్యాలు

సింహీ అపరాజితా మహా మంత్రాలయంలో మంత్రశాస్త్ర సాధన చేసిన అనేక మంది సాధకులు తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో అద్భుతమైన మార్పులు చూశారు. వారు మా మంత్రాలయంలోని అనుభవజ్ఞులైన పండితుల మార్గదర్శనంతో మంత్రశాస్త్రాన్ని అర్థం చేసుకోగలిగి, సాధన చేయగలిగి, తమ ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించగలిగారు.
కొంతమంది సాధకుల సాక్ష్యాలు ఇక్కడ ఉన్నాయి:

ఆధ్యాత్మిక వ్యాసాలు

సప్తశతీ దీక్షా నియమాలు

శ్రీ సింహీ అపరాజితా మహా మంత్రాలయం చండీ సప్తశతీ కలాప పూజా విధానముసప్తశతీ దీక్షా నియమాలు — అహం కమలానందనాధ

పూర్ణిమ చండీ హోమం

సింహీ అపరాజితా మహా మంత్రాలయం లో ప్రతి మాసం పూర్ణిమ రోజున మీ గోత్ర నక్షత్ర నామాలతో సామూహిక చండీ హోమం

పారాయణలు

చండీ సప్తశతి , మహా విద్యా , అంగిర ఋక్ పారాయణా క్రమాలు సుందరకాండ , అరుణ పారాయణలు తత్సంబంధిత కార్యక్రమాలు

తరచుగా అడిగే ప్రశ్నలు

జ. మంత్రశాస్త్రం అనేది శబ్ద శక్తిని ఉపయోగించి మన జీవితంలో సానుకూల మార్పులు తీసుకురాగల ఒక ప్రాచీన శాస్త్రం. మంత్రాలను జపించడం ద్వారా మనస్సును ఏకాగ్రత చేయవచ్చు మరియు ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించవచ్చు.

జ. ఎవరైనా మంత్రశాస్త్రాన్ని నేర్చుకోవచ్చు. వయస్సు, లింగం లేదా జాతి పరంగా ఎటువంటి పరిమితులు లేవు. మంత్రశాస్త్రాన్ని నేర్చుకోవడానికి నిబద్ధత మరియు ఆసక్తి మాత్రమే అవసరం.

జ. మంత్రశాస్త్ర సాధన చేయడం ద్వారా మీరు ఈ క్రింది లాభాలను పొందవచ్చు:

  • మానసిక శాంతి
  • ఆరోగ్యం
  • సమృద్ధి
  • సంతోషం
  • ఆధ్యాత్మిక అభివృద్ధి

జ. మా మంత్రాలయంలో ఈ క్రింది సేవలు అందుబాటులో ఉన్నాయి:

  • హోమాలు
  • ఆభిషేకాలు
  • పారాయణలు
  • కాలాపాలు
  • జపాలు
  • ప్రత్యక్ష సంప్రదింపులు
  • పరోక్ష సంప్రదింపులు

జ. మా మంత్రాలయాన్ని సంప్రదించడానికి, మీరు మా వెబ్‌సైట్‌లోని సంప్రదింపు విభాగాన్ని సందర్శించవచ్చు లేదా మాకు ఫోన్ చేయవచ్చు.

జ. అవును, మా మంత్రాలయంలో శక్తివంతమైన పవిత్ర వస్తువులు అందుబాటులో ఉన్నాయి. ఇవి మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీకు సహాయపడతాయి.

జ. మంత్రశాస్త్ర సాధనకు ఎంత సమయం పడుతుందో అనేది వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటుంది. ఇది మీ నిబద్ధత మరియు అభ్యాసంపై ఆధారపడి ఉంటుంది.

జ. మంత్రశాస్త్ర సాధనకు ఎటువంటి అడ్డంకులు లేవు. కానీ, సరైన మార్గదర్శనం లేకుండా మంత్రశాస్త్రాన్ని సాధించడం కష్టం కావచ్చు.

జ. మంత్రశాస్త్ర సాధన చేయడానికి ప్రత్యేకమైన నైపుణ్యాలు అవసరం లేదు. నిబద్ధత మరియు ఆసక్తి మాత్రమే అవసరం.

జ. మీరు ఇంట్లోనే మంత్రశాస్త్ర సాధన చేయవచ్చు. అయితే, మంత్రాలయంలో పండితుల మార్గదర్శనంతో సాధన చేయడం మరింత ప్రభావవంతంగా ఉంటుంది.