Description
వైజయంతీమాల అనేది దైవికమైన ఒక పవిత్ర మాల. “విజయానికి కారణమయ్యే మాల” అని అర్థం. “వైజయంతీ” అనే పదం “విజయం ఇచ్చేది” అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. ఇది శ్రీమహావిష్ణువు లక్ష్మి ఎల్లప్పుడూ తనవద్ద ఉండాలని ధరించే ఒక దివ్యమాలగా పురాణాల్లో ప్రస్తావించబడింది ఈ మాలను ధరించడం వల్ల ధర్మ మార్గము , సద్బుద్ధి , విద్య, జ్ఞానం ధనాదాయ వృద్ధి పెరుగుతుంది .సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున ప్రామాణికంగా సంస్కారం నిర్వహించిన జప మరియు ధారణా ఉపకరణం .
దుష్టశక్తులు, మాయదృష్టి, శాపనివారణ కలిగి గాఢమైన ధ్యానం, మంత్రసిద్ధి గురుకృప, ఆధ్యాత్మిక దర్శనాలు సంభవిస్తాయి . శత్రువులపై విజయం , తంత్రిక శక్తుల నియంత్రణ కలిగి జీవితం ప్రశాంతంగా కొనసాగుతుంది . లక్ష్మీ కటాక్షం కొరకు స్త్రీలు పురుషులు వయోభేదం లేకుండా ఈ మాలను ధరించవచ్చు
ఈ మాలను విష్ణు ప్రియమైన బుధవారం లేదా శనివారం రోజున ఉదయం 5 నుండి 6 :30 మధ్య ధరించాలి .
మాల ధరించే ముందు శరీరశుద్ధి మరియు మనశ్శుద్ధి తప్పనిసరి.స్నానం చేసిన తర్వాత, స్వచ్ఛమైన వస్త్రాలు ధరించాలి.
ఈ మాలను విభాగం సంస్కారం చేసినప్పటికీ ధరించే ముందు ధరించే వారు తులసీ నీరు లేదా గంగాజలంతో శుద్ధి చేయాలి.
నమో నారాయణాయ అనే విష్ణు మంత్రాన్ని 108 సార్లు అదే మాలతో జపించి తర్వాత రెండు చేతులతో మాలను తలపైకి ఎత్తి, “విష్ణోర్వైజయంతీ మాల త్వమేవ రక్ష మమ సర్వతః” అని ధరించాలి.
ఇది పవిత్రమైన మాల , అందుకే శుద్ధచిత్తంతో మాత్రమే ధరించాలి. ఆభరణంగా ధరించడం వల్ల ఉపయోగం ఉండదు .
శవకర్మలు, రజస్వల దినాలు, అంత్యక్రియల సమయంలో మాలను తీయాలి. అశుచిగా ఉన్నప్పుడు లేదా నిద్రలో ధరిస్తే మాల శక్తి తగ్గుతుంది.స్నాన సమయంలో మాలను తీయడం మంచిది.
నిత్య విష్ణు సంబంధ జపానికి కూడా ఈ మాలను ఉపయోగించవచ్చు .
జపానికి ప్రతి బీజాన్ని (పూసను) కుడిచేతి మధ్య వేలు (మధ్యమ) మరియు బొటనవేలు మధ్య కదిలించాలి. తారకం మణి (మేరు పూస ) వద్ద ఆగి తిరిగి వెనక్కి జపించాలి దానిని దాటి పోకూడదు. మనస్సు ఏకాగ్రంగా, నిశ్శబ్దంగా ఉండాలి.ఈ మాలను ధరించడం వల్ల శత్రువులపై విజయం కలుగుతుంది
మానసిక ఆందోళనలు తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక శక్తి , దైవదృష్టి పెరుగుతుంది.
దుష్ట గ్రహ నివారణ , దృష్టిదోషం, అశుభశక్తులు దూరమవుతాయి. పనులలో విజయం, ధనం, కీర్తి పొందుతారు.
వైజయంతీ మాలపై ఇతర దేవతల మంత్రాలు జపించరాదు. ఇది విష్ణుతత్వానికి చెందినది కాబట్టి వైష్ణవ మంత్రాలు , లక్ష్మి మంత్రాల జపానికి మాత్రమే ఉపయోగించాలి.
దీన్ని ఎల్లప్పుడూ పూజా స్థలంలో లేదా దేవుని సమీపంలో ఉంచాలి.
శ్రీమహావిష్ణువు ధరించిన ఈ వైజయంతి మాల, భక్తుని జీవితం లో సకల విజయాలను, శుభాలనూ శాంతిని, దైవకృపను ప్రసాదిస్తుంది.
లక్ష్మీ కటాక్షం కొరకు స్త్రీలు పురుషులు వయోభేదం లేకుండా ఈ మాలను ధరించవచ్చు








1 review for VAIJAYANTHI LAKSHMI MAALA