Description
“జ్వాలాముఖి మాల” అనే పేరు విన్నప్పుడు, చాలా మందికి అది అగ్ని శక్తి, రక్షణ, మరియు శత్రు విజయంతో సంబంధమున్నదని అర్ధం అవుతుంది . ఈ మాల,జ్వాలాముఖి రాయి తో తయారు చేస్తారు.
ఈ రాయి భూమి పై ఉన్న అగ్నిపర్వతం నుండి ఉద్భవించిన శిలా పదార్థం. అగ్ని పర్వతం పగిలినపుడు దాని నుండి విడుదల అయిన ద్రవ పదార్ధం గట్టిపడిన తరువాత దానినుండి ఈ జ్వాలా మాల పూసలు తయారు చేస్తారు .
అందువల్ల, ఇది అగ్ని, భూమి, మరియు వాయు శక్తి తత్వాల సమ్మేళనం.
ఈ రాయి సహజంగా తీవ్రమైన ఉష్ణశక్తిని కలిగి ఉంటుంది. వాత రోగాలు ఉన్నవారు శారీరక ఉష్ణ శక్తిని పెంచుకోడానికి ఈ మాలను నిత్యం ధరిస్తారు
ఇక పురాతన తాంత్రిక గ్రంథాల్లో దీనిని “అగ్ని భూత శక్తి రత్నం” అని పేర్కొన్నారు. ఇది అగ్ని తత్త్వంకి సంబంధించిన మాల.
ఈ మాల ధరించడం వల్ల శరీరంలోని నెగటివ్ ఎనర్జీని దహనం చేసి, పాజిటివ్ వైబ్రేషన్‌ను సృష్టిస్తుంది. భయాలు, శాపాలు, మంత్రదోషాలు, దృష్టిదోషాలు క్రమంగా తొలగిస్తుంది .
ఈ మాల మహాకాళి, భైరవ, అఘోర, సుబ్రహ్మణ్య, అగ్ని దేవత ఉపాసనలో ఎక్కువగా ఉపయోగిస్తారు. తీవ్రమైన మహా విద్యా సాధనాల్లో ఈ మల జపానికి మరియు ధారణకు ఉపయోగిస్తారు . శుద్ధిగా దీక్షలో ఉన్నవారు ఈ మాలను జపానికి ఉపయోగించి తరువాత ధారణా కూడా చేయవచ్చు .
జ్వాలాముఖి రాళ్లను చిన్న గుండ్రటి బీజాలుగా చెక్కి మాల తయారు చేస్తారు. వీటి రంగు సాధారణంగా నల్లగా ఉంటుంది.
ఈ మాలకు గ్రహాధిపతి కుజుడు . కుజ దోషం ఉన్నవారు కుజుడు హీనంగా ఉన్నవారు ఈ జ్వాలా మాలను నిత్యం ధరించవచ్చు
ఈ మాలకు అధిష్ఠాన దేవత భైరవుడు, కాళీమాత, అగ్నిదేవుడు .
ఈ మాల ధారణా వల్ల రక్షణ, ధైర్యం, విజయం, మానసిక శక్తి పెరుగుతాయి . శరీరం కాంతివంతం, ఉత్సాహభరితం గా ఉంటాయి .
దుష్టశక్తులు, మంత్రశాపాలు, అశుభదృష్టి దూరమవుతాయి. శత్రువులపై ధైర్యంగా నిలబడే శక్తి పెరుగుతుంది.
ఆత్మవిశ్వాసంపెరిగి డిప్రెషన్ తగ్గుతుంది .మానసిక ఏకాగ్రత పెరిగి ధ్యానంలో లోతుగా వెళ్ళగలుగుతారు.
అగ్ని తత్త్వం ద్వారా జీవశక్తి , జీర్ణ శక్తి పెరుగుతుంది.
మంగళవారం లేదా శుక్ర వారం ఉదయం 5 నుండి 6 మధ్య ఈ మాలను ధరించడం శ్రేష్ఠం. తిథితో సంబంధం లేదు .
ఈ మాలను ధరించే ముందు గంగాజలంతో లేదా గోమూత్రం తో సుద్ధి చేసి కర్పూర ధూపంతో వెయ్యాలి . ఆసనం పై కూర్చుని ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఆ దీపానికి నమస్కరించి “ హ్రీO జ్వాలా మాలిన్యై నమః అనే జపం 1008 సార్లు ఇదే మాలను ఉపయోగించి జపించి మాలను మేడలో ధరించవచ్చు . లేదా నిత్యా జపానికి ఉపయోగించవచ్చు . భైరవం , కాళీ , లేదా దశ మహా విద్యల జపాలు చేసేవారు ఈ మాలను జపానికి ఉపయోగించవచ్చు .
“జ్వాలాముఖి మాల అగ్నిశక్తి ధారిణి, దానిని ధరించినవాడు కర్మబంధనాలను దహనం చేసి జీవన విజయాన్ని పొందుతాడు.” • ఈ మాల సాధారణ ఆభరణం కాదు ఇది శక్తివంతమైన తాంత్రిక సాధనం. స్త్రీ పురుషులు ఉభయులూ ధరించవచ్చు .
దీనిని మద్యపానం, మాంసాహారం, సంసారము వంటి అశుభకాలంలో ధరించకూడదు. దీన్ని ఇతరులు తాకనివ్వకూడదు.
“ హ్రీO జ్వాలా మాలిన్యై నమః ఈ మంత్రం జ్వాలాముఖి దేవత యొక్క శక్తిని ఆవాహన చేస్తుంది. భయాలను తొలగిస్తుంది, ఆత్మవిశ్వాసం పెంచుతుంది. ఈ మంత్రాన్ని జ్వాలాముఖి మాలపై 108 సార్లు ప్రతిరోజూ ఉదయం లేదా రాత్రి నిత్యం జపించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తగ్గి ప్రశాంతత చేకూరుతుంది .
జపం పూర్తయిన తరువాత దేవికి నమస్కారం చేయాలి. మాల ధరించి మరుగుదొడ్డి లేదా అపవిత్ర స్థలాలకు వెళ్లకూడదు.
కోపం, ఆగ్రహం, దుఃఖం ఉన్నప్పుడు జపం చేయకూడదు. ఇతరులకి మాల ఇచ్చి వాడమని చెప్పకూడదు.
జపం మధ్యలో మాట్లాడకూడదు, జపం పూర్తి చేసిన తరువాత మాత్రమే మాట్లాడాలి. ఈ మాల ధారణా వల్ల భయం, దుఃఖం, శత్రు దోషం తొలగి, అగ్ని తత్వ శక్తి మీలో మేల్కొంటుంది.








1 review for JWAALA MAALA