Description
మహా కాళీ మహా లక్ష్మీ మహా సరస్వతీ త్రిశక్తి స్వరూపిణి చాముండాంబా ప్రసాద సిద్ధ్యర్ధం సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున నక్షత్రాధిక చండీ సప్తశతీ కలాపం నిర్వహించబడుతోంది . జీవితంలో ఎదురయ్యే అసంకల్పిత సమస్యలను అధిగమించడానికి , సద్విద్య , ఉద్యోగప్రాప్తి , వ్యాపార వృద్ధి , అనారోగ్య బాధా ఉపశమనానికి , వివాహం , అన్యోన్య దాంపత్యం , సత్సంతాన ప్రాప్తికి , ఆధ్యాత్మిక మార్గ దర్శనానికి కూడా ఈ కలాపం సహకరిస్తుంది . సంకల్పించిన కార్యాలలో మానవ ప్రయత్నంతో పాటు దైవానుగ్రహానికి ఈ మార్గం ఎంచుకోవచ్చు . శరత్కాలంలో ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి విజయ దశమి వరకు 10 రాత్రులు నిర్వహించే ఈ బృహత్తర కార్యక్రమంలో మీరూ ప్రత్యక్షంగా మరియూ పరోక్షం గా పాల్గొనవచ్చు .ఈ కలాపంలో నిత్య కార్యక్రమాలు ఉదయం నుండీ నిర్వహించబడినా ప్రత్యక్ష ప్రసారం మాత్రం సాయంత్రం 6 గంటలనుండీ వీక్షించే అవకాశం ఉంటుంది అని గమనించగలరు .








Reviews
There are no reviews yet