ఈవెంట్ నంబర్ 004
డిజిటల్ విప్లవంతో ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషలలో సమాచార వినిమయం జరుగుతూ ఉంది. మన తెలుగు విషయమే తీసుకుంటే ఇంతకు ముందు
సింహీ అపరాజితా మహా మంత్రాలయం అనేది మంత్రశాస్త్రాన్ని దుర్వినియోగం చేసే వారి నుండి రక్షించి, దాని ప్రామాణికతను కాపాడే లక్ష్యంతో స్థాపించబడింది. మంత్రశాస్త్రంలోని అసలు విలువలను ప్రచారం చేయడం, తప్పుడు పద్ధతులను నిరోధించడం మరియు సాధకులకు సరైన మార్గదర్శనం అందించడం ఈ మంత్రాలయం యొక్క ప్రధాన లక్ష్యాలు. 2012లో కాకినాడలో స్థాపించబడిన ఈ మంత్రాలయం, తన ప్రారంభం నుండే అనేక మందికి మేలు చేసింది.
సింహీ అపరాజితా మహా మంత్రాలయానికి స్వాగతం. నేను కమలానందనాథ దీక్షానామాంకిత పూర్ణదీక్షితుడను. శ్రీవిద్యపై అచంచల భక్తి విశ్వాసాలతో, ఆసక్తితో, నమ్మకంతో శ్రీవిద్యాంకములైన పూర్వవిద్యాక్రమం, ఉత్తరవిద్యాక్రమం, గురుత్రయ పాదుకాంతం, మహావిద్యాక్రమం పంచదశి, షోడశీ విద్యలు గ్రహించి, పురశ్చరణ ఒసగి, పూర్ణాభిషిక్తం గావించబడి పరదేవత కృపచే శాస్త్ర శోధనా జీవనం సాగిస్తున్నాను.
సింహీ అపరాజితా మహా మంత్రాలయ విభాగం ప్రారంభించబడిన మొదటి పుష్కర కాలంలోనే శతాధిక శ్రీవిద్యాన్వేషకులను స్వాగతించి వారినుండీ ఏరకమైన లాభాపేక్షా కాంక్షించకుండా కేవలం ఉపదేశాలే కాకుండా సాధనాకాలంలో వారి వెన్నంటి ఉండి విభాగంలో ఉన్నతులుగా తీర్చిదిద్దింది. ఒక సాధకుడికి విద్యతో పాటు విద్యా వినియోగం తప్పనిసరి.
కాలమాన అనుసారంగా ఈ విభాగం భవిష్య తరాలకు విద్యా విలువలు చేరవేసేందుకు విభాగ పటుత్వానికి కొన్ని ఆర్జిత సేవలను రూపొందించడం జరిగింది.
ఒక గురువు ద్వారా మంత్ర గ్రహణ చేయాలి అనుకున్నప్పుడు స్వగురు, పరమగురు, పరమేష్టి గురువుల వివరాలు ఖశ్చితంగా తెలుసుకుని ఉండాలి. అది ఉత్తమ విధిగా శాస్త్రం తెలియజేసింది.
సాక్షాత్ పరదేవతా స్వరూపులు అస్మత్ గురు వరేణ్యులు
సింహీ అపరాజితా మహా మంత్రాలయానికి స్వాగతం. భౌతిక శరీరానికి వ్యాయామం ఎంత ముఖ్యమో…. ఆంతరంగికమైన ఆత్మకు జపసాధన అంతే ముఖ్యం. వ్యాయామం శరీరానికి స్థిరమైన ఆకృతిని, పటుత్వాన్నీ కలగజేస్తే.. జపసాధన ఆత్మకు మానసిక పరిపక్వత, సక్రమ ఆలోచనా విధానం, కార్యదక్షత ఒసగుతుంది. మనల్నీ మన కుటుంబాన్ని, మన పరివారాన్నీ, చెడు వ్యక్తులనుండీ, చెడుశక్తులనుండీ రక్షించుకోడానికి మంత్రశాస్త్ర సాధన ఒక బ్రహ్మాస్త్ర కవచంలా పనిచేస్తుంది. దాన్ని సక్రమంగా అభ్యసించినపుడు మాత్రమే ఆఫలితం ప్రాప్తిస్తుంది. చాలా మంది మంత్రాలని పరోక్షం గా గ్రహించడం లేదా అసంపూర్ణంగా న్యాసాలు, ధ్యాన శ్లోకాలు లేకుండా గ్రహించడం చేస్తారు. అవి సత్ఫలితాలను ఇవ్వకపోగా కొంతకాలానికి మంత్రశాస్త్రంపై పలు అనుమానాలకు తావునిస్తుంది. మంత్ర గ్రహణ ఒక వైదిక కర్మలాగా పవిత్రమైన క్రియ. దాన్ని చాలామంది వారి స్వార్ధప్రయోజనాలకు బలి చేశారు. శాస్త్రం అభ్యసించడానికి శ్రధ్ధ, పట్టుదల, నమ్మిక, ఓర్పు ఉంటే చాలు కుల ప్రస్తావన లేదు. సింహీ అపరాజితా మహా మంత్రాలయం మంత్రశాస్త్ర అభ్యాస విభాగాలలో అందరూ సమానమే.. కుల ప్రాధాన్యత లేదు అని గమనించగలరు. ఆసక్తి కలిగి శాస్త్ర అధ్యయన శోధన చేయాలనుకునే వారు ఈ వార్షిక సభ్యత్వంలో ప్రవేశించవచ్చు
డిజిటల్ విప్లవంతో ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషలలో సమాచార వినిమయం జరుగుతూ ఉంది. మన తెలుగు విషయమే తీసుకుంటే ఇంతకు ముందు
డిజిటల్ విప్లవంతో ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషలలో సమాచార వినిమయం జరుగుతూ ఉంది. మన తెలుగు విషయమే తీసుకుంటే ఇంతకు ముందు
డిజిటల్ విప్లవంతో ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషలలో సమాచార వినిమయం జరుగుతూ ఉంది. మన తెలుగు విషయమే తీసుకుంటే ఇంతకు ముందు
డిజిటల్ విప్లవంతో ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషలలో సమాచార వినిమయం జరుగుతూ ఉంది. మన తెలుగు విషయమే తీసుకుంటే ఇంతకు ముందు
మీకు ఏవైనా సందేహాలు, ప్రశ్నలు లేదా సహాయం అవసరమైతే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి. మా నిపుణులు మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు.
WhatsApp us