Description
నవరత్నాలు అనేవి నవగ్రహాలకు సంబంధించిన తొమ్మిది రత్నాలు . సంప్రదాయ జ్యోతిష్య వివరాల ప్రకారం ఈ ఉంగరం వల్ల అనేక లాభాలు కలుగుతాయి .
నవగ్రహాల శాంతి : నవరత్న ఉంగరం నవగ్రహాల ప్రభావాన్ని సమతుల్యం చేసి, జీవితంలో ఎదురయ్యే కష్టాలను సులభంగా ఎదుర్కునే మనో ధైర్యాన్ని కలిగిస్తుంది .
మనశ్శాంతి : మనసులో కలిగే ఆందోళన ఆంతరంగిక భయాలు క్రమంగా తగ్గి , ఆలోచనా విధానం ఉన్నతంగా ప్రశాంతంగా ఉంటుంది . దానివల్ల ఈ నవరత్నాలు ధరించినవారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది .
మనం ఎంచుకున్న మార్గంలో సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి, ధైర్యం పెరిగి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది .
గ్రహ పాలన ప్రభావాలు సూర్యరశ్మి వల్ల మనమీద ప్రకృతిమీద ప్రభావం చూపిస్తాయి . ఆ గ్రహాల స్థితిని బట్టి మన మానసిక , శారీరక స్థితులు ప్రభావం అవుతాయి . గ్రహ పాలన వల్ల కలిగే ప్రతికూల స్థితులను అధిగమించి మంచి స్థితిని పొందటానికి ఈ నవరత్నాలు మనకు సహకరిస్తాయి అంతేకాకుండా ధరించిన వారి శారీరక ,మానసిక ఆరోగ్యానికి సహాయపడతాయి .
మన జీవితంలో కేవలం ప్రయత్నం మాత్రమే గెలవదు దానికి మన అదృష్టంకూడా సహకరించాలి అటువంటి అదృష్టాలు ఈ రత్నాలు అందిస్తాయని శాస్త్ర ప్రమాణము .
ఈ నవరత్నాలు బంగారం లో కానీ వెండిలో కానీ పంచ లోహాలతో కానీ కుడి చేతి మధ్యవేలుకి ఉంగరంగా చేయించుకోవచ్చు . ఇవి 20 సెంట్స్ ప్రమాణంలో ఈ విభాగం అందిస్తోంది .
ఈ ఉంగరం తయారీ పూర్తి అయ్యాకా పండిత సహకారంతో ఒక ఈశ్వర అభిషేకం ఈ ఉంగరాన్ని ఉంచి చేయించి . తరువాత వచ్చే శుక్ర లేదా ఆదివారం ఉదయం 6 నుండి 7 గంటలమధ్య ధరించాలి .








Reviews
There are no reviews yet