Description
త్రిముఖి రుద్రాక్ష మాల
త్రిముఖి రుద్రాక్ష మాల ధైర్యాన్ని వృద్ధి చేస్తుంది రుణబాధలు తగ్గిస్తుంది , వ్యాపార వ్యవహారాలలో ఉన్నవారు ఈ మాల జపానికి , ధారణకు వినియోగించడం వల్ల ఉన్నతమైన ఫలితాలు లభిస్తాయి .
త్రిముఖి రుద్రాక్ష ధరించడం వల్ల గత కర్మల నుండి విముక్తి, ఆత్మవిశ్వాసం, శక్తి పెరుగుదల, కోపం, భయం వంటి ప్రతికూల భావాలను జయించడం, జీర్ణకోశ వ్యాధుల నుండి ఉపశమనం, ఏకాగ్రత, సమతుల్యత వంటి ప్రయోజనాలు లభిస్తాయి ఇది త్రిమూర్తుల (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు) స్వరూపంగా, అగ్ని స్వరూపంగా భావిస్తారు, ఆరోగ్య, ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం దీనిని ధరిస్తారు
చైతన్యం రక్షణ లేని గర్భాలయం వంటిది మన శరీరం . మనం ధరించే వనరులు మన శరీరం మీద ప్రతిష్టించే శక్తులు . అందుకే శరీరం మీద ప్రత్యేకంగా మెడ భాగం లో ఏదో ఒక ఆభరణం లేదా శక్తిని కలిగించే రుద్రాక్షలు ధరించడం మన శరీరానికి రక్షణ కలిగిస్తుంది .
రుద్రాక్ష ధారణ వల్ల మన బాహ్య ఆరా బలపడుతుంది అంతే కాకుండా శరీరం ప్రశాంతంగా ప్రకాశిస్తుంది . ఆధ్యాత్మిక మార్గం అన్వేషించేవారు శరీర రక్షణకు మరియు పవిత్రతకు రుద్రాక్ష మాలలను ధరిస్తారు . ఈ మాలలు సాధారణ విషతుల్య ప్రయోగాల ప్రభావాలను కూడా నిర్వీర్యం చేస్తాయని శాస్త్ర సారం . రుద్రాక్ష ధారణ వల్ల మనో నిగ్రహం కలిగి సాధనా మార్గం లో ఏర్పడే ప్రతికూలతలు మరియు ఇబ్బందులు తొలగి చక్కని సాధన కొనసాగుతుంది . ఈ రుద్రాక్ష మాలలు 108 విత్తనాలతో పాటు 1 మేరు పూస కలిగి ఉంటుంది . సాధారణంగా ఇవి దారంతో తయారు అవుతాయి కనుక దీర్ఘకాల మన్నిక కోసం వినియోగించే ముందే రాగి లేదా వెండి తీగతో చేయించుకుని పంచామృతాలతో మీ గృహంలో దేవతార్చన దగ్గర శుద్ధి చేసుకుని తొలిసారి సోమవారం రోజు ఉదయం బ్రాహ్మీ సమయంలో ధరించడం ఉత్తమం . సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున ఈ మాలలు ప్రోక్షణ సంస్కారం గావించబడి 6 కు పైగా సంస్కారాలు పూర్తి చేసుకుని మీకు చేరుతున్నాయి అని గమనించగలరు . ఇవి చాలా శక్తివంతమైనవి . కేవలం జపానికే కాక ధారణకు కూడా ఈ మాలలు ఉత్తమం . ఈ మాల ధరించి బైట పనులు వృత్తులు ఆచరించవచ్చు . స్త్రీలు కూడా ఈ మాలలు నెలసరి ముందు వరకు ధరించి నెలసరి దగ్గరలో తీసి ఇబ్బంది పూర్తి అయ్యాక 6 వ రోజు మరలా ధరించవచ్చు . ఈ రుద్రాక్షలు హిమాలయ శిఖరాలు మరియు నేపాల్ భూభాగం నుండి ఎక్కువగా గ్రహించబడతాయి , ఈ విభాగం నుండి గ్రహించిన మాల మీకు ఉత్తమ ఫలితాలను అందించాలని ఆశిస్తూ .. సింహీ అపరాజితా మహా మంత్రాలయం . అహం కమలానందనాధ .








Reviews
There are no reviews yet