Description
10 ముఖాల రుద్రాక్ష (10 Mukhi Rudraksha) ధరించడం వల్ల దుష్ట శక్తులు, గ్రహ దోషాల నుండి రక్షణ లభిస్తుంది, విష్ణువు ఆశీస్సులు, మనశ్శాంతి, ఆనందం, ఉత్సాహం కలుగుతాయి, కుటుంబానికి మేలు జరుగుతుంది, ప్రేమ, కరుణ పెరుగుతాయి, మరియు అన్ని దిశల నుండి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ఇది అన్ని గ్రహాల చెడు ప్రభావాలను తగ్గించి, ఆధ్యాత్మిక ఎదుగుదలకు, సంతోషానికి సహాయపడుతుంది.
రుద్రాక్ష ధారణ వల్ల మన బాహ్య ఆరా బలపడుతుంది అంతే కాకుండా శరీరం ప్రశాంతంగా ప్రకాశిస్తుంది . ఆధ్యాత్మిక మార్గం అన్వేషించేవారు శరీర రక్షణకు మరియు పవిత్రతకు రుద్రాక్ష మాలలను ధరిస్తారు . ఈ మాలలు సాధారణ విషతుల్య ప్రయోగాల ప్రభావాలను కూడా నిర్వీర్యం చేస్తాయని శాస్త్ర సారం . రుద్రాక్ష ధారణ వల్ల మనో నిగ్రహం కలిగి సాధనా మార్గం లో ఏర్పడే ప్రతికూలతలు మరియు ఇబ్బందులు తొలగి చక్కని సాధన కొనసాగుతుంది . ఈ రుద్రాక్ష మాలలు 108 విత్తనాలతో పాటు 1 మేరు పూస కలిగి ఉంటుంది . సాధారణంగా ఇవి దారంతో తయారు అవుతాయి కనుక దీర్ఘకాల మన్నిక కోసం వినియోగించే ముందే రాగి లేదా వెండి తీగతో చేయించుకుని పంచామృతాలతో మీ గృహంలో దేవతార్చన దగ్గర శుద్ధి చేసుకుని తొలిసారి సోమవారం రోజు ఉదయం బ్రాహ్మీ సమయంలో ధరించడం ఉత్తమం . సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున ఈ మాలలు ప్రోక్షణ సంస్కారం గావించబడి 6 కు పైగా సంస్కారాలు పూర్తి చేసుకుని మీకు చేరుతున్నాయి అని గమనించగలరు . ఇవి చాలా శక్తివంతమైనవి . కేవలం జపానికే కాక ధారణకు కూడా ఈ మాలలు ఉత్తమం . ఈ మాల ధరించి బైట పనులు వృత్తులు ఆచరించవచ్చు . స్త్రీలు కూడా ఈ మాలలు నెలసరి ముందు వరకు ధరించి నెలసరి దగ్గరలో తీసి ఇబ్బంది పూర్తి అయ్యాక 6 వ రోజు మరలా ధరించవచ్చు . ఈ రుద్రాక్షలు హిమాలయ శిఖరాలు మరియు నేపాల్ భూభాగం నుండి ఎక్కువగా గ్రహించబడతాయి , ఈ విభాగం నుండి గ్రహించిన మాల మీకు ఉత్తమ ఫలితాలను అందించాలని ఆశిస్తూ .. సింహీ అపరాజితా మహా మంత్రాలయం . అహం కమలానందనాధ .








Reviews
There are no reviews yet