Description
సమస్త శత్రుబాధలూ తొలగించి ఆశ్రయించినవారికి సంపూర్ణ రక్షణ అందించే వారాహీ మాత అనుగ్రహం కోసం ఆషాఢ మాసం లొ వచ్చే గుప్త నవరాత్రుల్లో వారాహీ మాత సంపూర్ణ కృపా కటాక్షాలు భక్తులపై వర్షించాలని సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున గుప్త నవరాత్ర వారాహీ నిత్య హోమం నిర్వహించడానికి సంకల్పించడం జరిగింది .
ఈ హోమాలలో నిత్యం మీ గోత్ర నామాలతో సంకల్పించి విశేష ద్రవ్యాలతో వారాహీ హోమం ఆచరించడం జరుగుతుంది .
ప్రతీ రోజూ సాయం సంధ్యా సమయంలో అంటే సుమారు సాయంత్రం 6 :౩౦ కి సంకల్పించి రాత్రి 7 గంటలకు హోమం ప్రారంభించబడుతుంది . ఈ హోమం సంకల్పం తరువాత ఒక గంట సమయం బృహత్ వారాహీ మూల మంత్రం తో నిర్వహించబడుతుంది . నిత్యం హోమం తరువాత ఆజ్య పూర్ణాహుతి చేసి నవరాత్రులు పూర్తీ అయ్యే రోజు మహా పూర్ణాహుతి నిర్వహిస్తారు .
ఈ సంవత్సరం జులై 15 నుండి జులై 23 వరకు వారాహీ నవరాత్రులు నిర్వహించబడతాయి . ఈ బృహత్ వారాహీ హోమం లొ పాల్గొనడం వల్ల అమ్మవారి సంపూర్ణ కృపా కటాక్షాలు కలిగి సమస్త బాధలు నశిస్తాయి .
తీవ్రమైన శత్రుబాధలు , నరఘోష , బంధు ఘోష , పర ప్రయోగాలు , కోర్ట్ సమస్యలు , అనారోగ్య బాధలు , వ్యాపార స్తంభనం వంటి ఇబ్బందులు ఉన్నవారు ఈ క్రతువులో పాల్గొనడం వల్ల ఆ ఇబ్బందులు తొలగి ప్రశాంతమైన జీవితాన్ని విజయాలను పొందగలరు .
ఈ వారాహీ నవరాత్రులలో నిత్యం జరిగే హోమాలలో మీ గోత్ర నామాలతో సంకల్పించి నిర్వహించడానికి 5001 రూ విభాగానికి చెల్లించి మీ గోత్ర నామాలు పొందుపరచి నమోదు చేసుకోగలరు . ఇది పరోక్ష హోమం కనుక సుదూరాలలో ఉండేవారు ఈ కార్యక్రమం నిత్యం వీక్షించే విధంగా సింహీ అపరాజితా ఛానల్ నుండి లైవ్ లొ చూడవచ్చు .
ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి నవరాత్రుల తరువాత ఒక వారం లోపు అమ్మవారి ప్రసాదం , హోమ భస్మం , అర్చనా కుంకుమ కొరియర్ ద్వారా పంపబడతాయి .
వారాహీ ప్రసాద సిద్ధిరస్తు .
సింహీ అపరాజితా మహా మంత్రాలయం . అహం కమలానందనాధ .
Reviews
There are no reviews yet