Description
ఈ కంకణం సుబ్రహ్మణ్య మాలా మంత్రంతో శక్తి క్రియ నిర్వర్తించబడినది. ప్రయాణ అసౌచం లేకుండా ఈ కంకణం సంస్కరంచి మీకు అందించబడుతోంది. సుబ్రహ్మణ్య మూల మంత్రం ఉపదేశం ఉన్నవారు ఈ కంకణం ధరించి స్వామి వారి జపం చేయడం ఉత్తమఫలితాలను ఇస్తుంది. మూలమంత్రం ఉపదేశం లేనివారు “స్కందాయనమః ” అనే నామ స్మరణ చేస్తూ స్వామివారిని పూజించడం సర్వోత్తమం. ఈ కంకణం రోజంతా ధరించి ఉండవచ్చు.
స్త్రీలు నెలసరి దగ్గరవుతున్న రోజుల్లోనే కంకణం తీసి దేవతార్చన వద్ద భద్రపరచుకుని నెలసరి పూర్తి అయ్యాకా 6 వరోజు ఉదయం మరలా ధరించవచ్చు.
ఈ నియమాలు పాటించడం వల్ల కరుంగళి కంకణం దీర్ఘకాలం పటుత్వాన్ని కలిగి మనో ధైర్యాన్నీ సంకల్పించిన కార్యాలలో విజయాన్నీ ప్రసాదిస్తుంది. కరుంగళి కంకణం చిన్న వయస్కులు నుండీ ఎవరైనా ధరించడానికి ఆమోదయోగ్యమైనది. ఈ కరుంగళి కంకణ ధారణ వల్ల ఉపయోగాలు: మానసిక ప్రశాంతతను చేకూర్చి, మనపై మనకు నమ్మకాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకు ఉద్యోగస్తులకు మానసిక ఒత్తిడి తగ్గించుటకు సహకరిస్తుంది. వ్యాపార రంగం లో ఉన్న వారికి సరైన నిర్ణయం సకాలంలో తీసుకునే జ్ఞానాన్ని పెంచుతుంది. దుష్ప్రభావాల (నెగిటివ్ ఆరా ) నియంత్రణకు, కుజ గ్రహ శాంతికి , వివాహ దాంపత్య సంతాన పరమైన సత్వర కామ్యసిద్ధికి. శారీరక, మానసిక ఆరోగ్యం కొరకు ఈ మాలను నమ్మకంగా ధరించవచ్చు. శ్రీ సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున గ్రహించిన ఈ కరుంగళి కంకణం మెరుగైన శుభ ఫలాలు మీకు అందివ్వాలని ఆ పరదేవతను కోరుకుంటూ…


1 review for KARUNGALI BRACELET