Previous
Previous Product Image

కరుంగళి మాల

Original price was: ₹1,500.00.Current price is: ₹890.00.
Next

రుద్రాక్ష మాల

Original price was: ₹800.00.Current price is: ₹690.00.
Next Product Image

సహజ తులసి మాల

Original price was: ₹1,000.00.Current price is: ₹600.00.

Tulasi Mala: స్త్రీలకు మంగళప్రదమైన ఫలితాలను ఒసగ మాలా రాజం తులసి. కేవలం స్త్రీలు మాత్రమే కాకుండా ఈ మాలను పురుషులు, పిల్లలు కూడా ధరించవచ్చు. శుద్ధ విద్యల జపానికైనా, సాత్విక జీవన విధానంలో నిత్య ధారణకైనా ఈ మాలను వినియోగించుకోవచ్చు. మహా లక్ష్మి కి శ్రీమహా విష్ణువుకీ అత్యంత ప్రీతిపాత్రమైన తులసి మాల వైష్ణవ సంప్రదాయంలో విశేష ప్రాచుర్యం కలిగినది. మంత్రశాస్త్రంలో ఏ శుధ్ధవిద్యా సాధనకైనా తులసి మాల వినియోగం ఉత్తమంగా చెప్పబడినది. ఏ ఉపకరణాన్ని సాధనామార్గంలో వినియోగించాలన్నా ఆ ఉపకరణానికి సంస్కారం తప్పనిసరి అని గుర్తించండి….

Description

Tulasi Mala: స్త్రీలకు మంగళప్రదమైన ఫలితాలను ఒసగ మాలా రాజం తులసి. కేవలం స్త్రీలు మాత్రమే కాకుండా ఈ మాలను పురుషులు, పిల్లలు కూడా ధరించవచ్చు. శుద్ధ విద్యల జపానికైనా, సాత్విక జీవన విధానంలో నిత్య ధారణకైనా ఈ మాలను వినియోగించుకోవచ్చు. మహా లక్ష్మి కి శ్రీమహా విష్ణువుకీ అత్యంత ప్రీతిపాత్రమైన తులసి మాల వైష్ణవ సంప్రదాయంలో విశేష ప్రాచుర్యం కలిగినది. మంత్రశాస్త్రంలో ఏ శుధ్ధవిద్యా సాధనకైనా తులసి మాల వినియోగం ఉత్తమంగా చెప్పబడినది. ఏ ఉపకరణాన్ని సాధనామార్గంలో వినియోగించాలన్నా ఆ ఉపకరణానికి సంస్కారం తప్పనిసరి అని గుర్తించండి. కంఠానికి ధరించిన మాల జపానికి పనికిరాదు అనే సూత్రం ఈ తులసి మాలకు వర్తించదు. మనం చేసే జపం వల్ల మాలకు పవిత్రత కలుగుతుంది కనుక సంస్కారం అవసరం లేదు అని కొందరి వ్యంగ వాదన.. ఒక ద్రవ్యం ఒక దైవిక కైంకర్యానికి వినియోగించేముందు ఆ ద్రవ్యాన్ని సంస్కరించి మాత్రమే వినియోగించాలి. సింహీ అపరాతా మహామంత్రాలయం తరఫున సాధకులకు ధారణ మరియూ జప వినియోగాలకు సహజ తులసి మాలలను త్రిక సంస్కారం చేసి అందుబాటులోకి తీసుకొచ్చినది. ఈ మాలలు పూర్తిగా సహజ సిద్ధమైనవి మరియూ సంపూర్ణ సంస్కారం ఒసగబడినవి. ప్రామాణిక విధులు అనుసరించి ఈ తులసి మాల సంస్కారంలో పంచకవ్వములతో మార్జన నిర్వర్తించబడినది. మాలలను పూర్తిగా 3 రాత్రులు పంచకవ్యాలలో నానబెట్టినట్లైతే వినియోగంలో అతి కొద్దికాలానికి అని పెరిగిపోతాయి (తెగిపోతాయి) కనుక మాలా సంస్కారం లో పంచకవ్యాలను మార్జనకు పరిమితం చేయడం జరిగింది. ఈ తులసి మాల వినియోగం వల్ల సాధన, మానసిక స్థితి ప్రశాంతంగా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. 8సంవత్సరాలు ప్రవేశించినవారి లగాయతు ఏ వయస్కులు అయినా ఈ తులసి మాలను ధరించవచ్చు లేదా వినియోగించవచ్చు. తులసి మాల ధారణ చాలా ప్రశాంతతతో కూడిన జీవనస్థితి వర్చస్సును ప్రసాదిస్తుంది. ఈమాల బుధగ్రహ పీడను దోషాలను కూడా నియంత్రిస్తుంది. మంచి మరియూ మానసిక ప్రశాంతతనూ ఈ రుద్రాక్ష మారి ప్రసాదిస్తుంది. సాధనామార్గంలో ఉన్న స్త్రీలు ఈ తులసి మాల నిత్యం ధరించడం, వినియోగించడం వల్ల సాధన సవ్యంగా కొనసాగించుకునే అవకాశం లభిస్తుంది. మానసికోన్నతిని ప్రసాదించే ఈ తులసి మాల పురుషసూక్త విష్ణు సహస్రనామ పారాయణా యుక్తంగా మహావిష్ణు ఆరాధనతో సిద్ధపరచబడుతోంది ఈ తులసి మాల నిత్యం ధరించవచ్చు. పురుషులు నెలంతా మరియూ స్త్రీలు నెలసరి తరువాత 21 రోజులు నిస్సందేహంగా ధరించచ్చు.. స్త్రీలు నెలసరి రోజుల్లో తులసి మాల ధరించకూడదు. ముట్టుకోరాదు, ఈ మాల ధరించి ఉండగా మద్య, మాంసములు స్వీకరించకూడదు. మెరుగైన ఫలితాలకై తులసి మాల ధరించేటపుడు నమో నారాయణాయ అని జపిస్తూ ధరించడం ఉత్తమం. ప్రయాణ అసౌచం లేకుండా ఈతులసిమాల సంస్కరంచి మీకు అందించబడుతోంది.

Reviews

There are no reviews yet.

Be the first to review “సహజ తులసి మాల”

Your email address will not be published. Required fields are marked *