Description
Karungali Mala: కరుంగళి మాల సరఘోష, దృష్టి దోష, పరబాధలను శాంతింపజేసి సంకల్పించిన కార్యాలలో విజయాన్ని ప్రసాదించడంలో అగ్రగామి. ఈ మాలకు సుబ్రహ్మణ్య అభిషేక శక్తి క్రియ నిర్వర్తించబడినది. ప్రయాణ అసౌచం లేకుండా ఈ మాలను సంస్కరంచి మీకు అందించబడుతోంది. సుబ్రహ్మణ్య మూల మంత్రం ఉపదేశం ఉన్నవారు ఈ మాల ధరించి స్వామి వారి జపం చేయడం ఉత్తమఫలితాలను ఇస్తుంది. మూలమంత్రం ఉపదేశం లేనివారు “స్కందాయనమః ” అనే నామ స్మరణ చేస్తూ స్వామివారిని పూజించడం సర్వోత్తమం. ఈ మాలను రోజంతా ధరించి ఉండవచ్చు. రాత్రి భాగంలో మాలను తీసి దేవతార్చన వద్ద ఉంచి మరుసటిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత మరలా ధరించవచ్చు. సహజంగానే శక్తివంతమైన ఈ మాలను స్వామివారి అభిషేకం లో ఉంచడంవల్ల మరింత పవిత్రత మరియూ చైతన్యాన్ని పొందుతుంది. మీకు సంస్కరించిన మాలనే అందించడం జరుగుతోంది. ఈ మాల ధరించి ఉండగా మద్య పానము, మాంస భక్షణం. శృంగారము చేయరాదు. అటువంటి తప్పిదం జరిగితే ఆ మాలకు ఉన్న శక్తి క్షీణించి మరలా వినియోగానికి పనికిరాదు. స్త్రీలు నెలసరి దగ్గరవుతున్న రోజుల్లోనే మాలను తీసి దేవతార్చన వద్ద భద్రపరచుకుని నెలసరి పూర్తి అయ్యాకా 6 వరోజు ఉదయం మరలా ధరించవచ్చు. ఈ నియమాలు పాటించడం వల్ల కరుంగళి దీర్ఘకాలం పటుత్వాన్ని కలిగి మనో ధైర్యాన్నీ సంకల్పించిన కార్యాలలో విజయాన్నీ ప్రసాదిస్తుంది. మంగళవారం స్కంద అభిషేకంలో ఉంచిన ఈ కరుంగళి ఏదైనా మంగళవారం రోజే ధరించడం ఉత్తమం. కరుంగళి చిన్న వయస్కులు నుండీ ఎవరైనా ధరించడానికి ఆమోదయోగ్యమైనది. ఈ కరుంగళి మాల ధారణ వల్ల ఉపయోగాలు: 45 మానసిక ప్రశాంతతను చేకూర్చి, మనపై మనకు నమ్మకాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకు ఉద్యోగస్తులకు మానసిక ఒత్తిడి తగ్గించుటకు సహకరిస్తుంది. వ్యాపార రంగం లో ఉన్న వారికి సరైన నిర్ణయం సకాలంలో తీసుకునే జ్ఞానాన్ని పెంచుతుంది. దుష్ప్రభావాల (నెగిటివ్ ఆరా ) నియంత్రణకు, కుజ గ్రహ శాంతికి వివాహ దాంపత్య సంతాన పరమైన సత్వర కామ్యసిద్ధికి. శారీరక, మానసిక ఆరోగ్యం కొరకు ఈ మాలను నమ్మకంగా ధరించవచ్చు. శ్రీ సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున గ్రహించిన ఈ కరుంగళి మాల మెరుగైన శుభ ఫలాలు మీకు అందివ్వాలని ఆ పరదేవతను కోరుకుంటూ…
Reviews
There are no reviews yet.