Description
ఈ యంత్రం నవరాత్రాధిక సంస్కారము తో శక్తి క్రియ నిర్వర్తించబడినది . యంత్ర సంస్కారం లో భాగంగా మొదటి 6 రోజుల క్రియా ముందస్తుగా ఆచరించి మీ నమోదు తరువాత మిగతా 3 రోజుల క్రియా నిర్వర్తించి మీకు పంపబడుతుంది . సంస్కారం అయ్యకా ప్రయాణంలో అశౌచం తగలకుండా దిగ్బంధనం చేసి పంపబడుతుంది . యంత్రం మీకు అందిన తరువాత దానిని స్థాపించడానికి ముందుగా యంత్రానికి కట్టి ఉంచిన దిగ్బంధన తాడు తొలగించి యంత్రాన్ని ఒకసారి మంచి నీటితో శుభ్రపరచి గంధం, కుంకుమ అలంకరించి 6/6 సైజు ఫోటో ఫ్రేమ్ లో పెట్టి సాంబ్రాణి ధూపం వేసి ఇంటికి లేదా వ్యాపా స్థలానికి ప్రధాన ద్వారం పైన వ్రేలాడేలా స్థాపించాలి . ఈ మంత్రం ఉపదేశం ఉన్నవారు వారి గురువుల సూచన మేరకు దేవతార్చనలో యంత్రాన్ని స్థాపించి యంత్రానికి తర్పణాలు పూజాదికాలు , నివేదనలు నిర్వర్తించవచ్చు . అలా చేయడం వల్ల యంత్రం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది . స్థాపన చేసే యంత్రాలు నేలపై , పీఠం పై ప్రత్యక్షంగా పెట్టరాదు యంత్రం క్రింద ప్లేట్ ( ఆధారం ) తప్పనిసరిగా ఉండాలి అని గమనించగలరు . స్థాపన చేసే ఏ యంత్రానికైనా నైమిత్తికాలలో అంటే శుద్ధం లో అష్టమి , పున్నమి , బహుళ అష్టమి , మాస శివరాత్రి తిధులలో విశేష పూజ నైవేద్యము ( కనీసంగా తేనె ) సమర్పించాలి .అలా చేయడం వల్ల యంత్రం మెరుగైన శుభ ఫలితాలు అందించగలుగుతుంది . గుమ్మం పైన వ్రేలాడేలా ఉంచిన యంత్రాలకు ప్రత్యేక పూజలు అవసరం లేదు . యంత్రాలు నమోదు చేసుకున్నకా వాటి లభ్యత మీద మీకు అందించే సమయం ఆధారపడి ఉంటుంది కనుక నమోదు తరువాత 5 నుండి 15 రోజుల వ్యవధిలో ఈ యంత్రం మీకు చేరుతుంది అని గమనించగలరు . ఈ యంత్ర వినియోగం యేల ఉపయోగించాలి అనేది యంత్రంతో పాటుగా ఒక అనుబంధ పత్రం మేకు అందించడం జృగుతుంది . దానిని అనుసరిస్తూ యంత్ర ఆరాధన చేసి సత్ఫలితాలు పొందగలరు సింహీ అపరాజితా మహా మంత్రాలయం నుండి సంస్కరించబడి మీరు పొందిన ఈ యంత్రం మీకు మెరుగైన శుభ ఫలితాలు అందించాలని ఆశిస్తూ .. అహం కమలానందనాధ
Reviews
There are no reviews yet.