Description
జపానికైనా, ధారణకైనా మాలా అగ్రగామి గా పేర్కొనబడినది రుద్రాక్ష మాల . మహాదేవునికి అత్యంత ప్రీతిపాత్రమైన రుద్రాక్ష శైవ శాక్తేయ పరంపరలో విశేష ప్రాచుర్యం కలిగినది. మంత్రశాస్త్రంలో అధికశాతం శైవ శాక్తేయ క్రమాలే కనుక తత్సంబంధిత సాధనలకు రుద్రాక్ష మాల వినియోగం ఉత్తమంగా చెప్పబడినది. ఏ ఉపకరణాన్ని సాధనామార్గంలో వినియోగించాలన్నా ఆ ఉపకరణానికి సంస్కారం తప్పనిసరి అని గుర్తించండి. మనం జపానికి వినియోగిస్తాం కనుక ఆ మాల మనం చేసే మంత్రం వల్ల పవిత్రత కలుగుతుంది కనుక సంస్కారం అవసరం లేదు అని కొందరి వ్యంగ వాదన.. ఒక ద్రవ్యం ఒక దైవిక కైంకర్యానికి వినియోగించేముందు ఆద్రవ్యాన్ని సంస్కరించి మాత్రమే వినియోగించాలి. సింహీ అపరాజతా మహామంత్రాలయం తరఫున సాధకులకు ధారణ మరియూ జప వినియోగాలకు నల్ల రంగు సహజ రుద్రాక్ష మాలలను త్రిరాత్రాధిక సంస్కారం చేసి అందుబాటులోకి తీసుకొచ్చినది. ఈ మాలలు పూర్తిగా సహజ సిద్ధమైనవి మరియూ సంపూర్ణ సంస్కారం ఒసగబడినవి. ప్రామాణిక విధులు అనుసరించి ఈ రుద్రాక్ష మాల సంస్కారంలో పంచకవ్యములతో మార్జన నిర్వర్తించబడినది. మాలలను పూర్తిగా 3 రాత్రులు పంచకవ్యాలలో నానబెట్టినట్టైతే వినియోగంలో అతి కొద్దికాలానికే అవి పెరిగిపోతాయి (తెగిపోతాయి) కనుక మాలా సంస్కారం లో పంచకవ్యాలను మార్జనకు పరిమితం చేయడం జరిగింది. ఈ రుద్రాక్ష మాల వినియోగం వల్ల సాధన ఉన్నతంగా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. 8సంవత్సరాలు ప్రవేశించినవారి లగాయతు ఏ వయస్కులు అయినా ఈ రుద్రాక్ష మాలను ధరించవచ్చు. రుద్రాక్ష మాల ధారణ వల్ల చెడు మనస్తత్వం, ఆలోచనలూ తగ్గి సందర్భానుసారం స్పందించే లక్షణం ప్రాప్తించడమే కాకుండా దృష్టి దోషాలను కూడా నియంత్రిస్తుంది. ఏ రకమైన చెడునైనా నియంత్రించి మంచి వర్చస్సును మరియూ మానసిక ప్రశాంతతనూ ఈ రుద్రాక్ష మాల ప్రసాదిస్తుంది. ఈ మాల ధారణకైనా, సాధనకైనా ఏదేనీ ఒక విధంగా మాత్రమే వినియోగించుకోవచ్చు. సాధనామార్గంలో ఉన్నవారు ఈ రుద్రాక్ష మాల నిత్యం ధరించడం వల్ల సాధనాపరమైన ప్రతికూలతలు తగ్గి సాధన సవ్యంగా కొనసాగించుకునే అవకాశం లభిస్తుంది. సాధారణ ప్రతిక్రియలను పైతం నిలువరించే విధంగా ఈ రుద్రాక్ష మాల నమక ప్రశ్న, చమక అనువాక యుక్తంగా రుద్రార్చన తో సిద్ధపరచబడుతోంది ఈ రుద్రాక్ష మాల నిత్యం ధరించవచ్చు. పురుషులు నెలంతా మరియూ స్త్రీలు నెలసరి తరువాత 21రోజులు నిస్సందేహంగా ధరించచ్చు. స్త్రీలు నెలసరి రోజుల్లో రుద్రాక్ష మాల ధరించకూడదు. ముట్టుకోరాదు మెరుగైన ఫలితాలకై రుద్రాక్ష మాల ధరించేటపుడు శివాయ నమ ఓం నమః శివాయ అని జపిస్తూ ధరించడం ఉత్తమం. ప్రయాణ అసౌచం లేకుండా ఈ రుద్రాక్ష మాల సంస్కరంచి మీకు అందించబడుతోంది. దుష్ప్రభావాల (నెగిటివ్ ఆరా) నియంత్రణకు, శని గ్రహ శాంతికి సాధనా పటుత్వానికీ ఈ రుద్రాక్ష మాలను నమ్మకంగా ధరించవచ్చు. ఈ ప్యాక్ లో కాళ రుద్రాక్ష ( నలుపు రుద్రాక్ష ) జప మాలతో పాటు ధారణా కాళ రుద్రాక్ష( నలుపు రుద్రాక్ష ) మాల అందించబడుతుంది .
Reviews
There are no reviews yet.