Description
కంఠానికి ధరించిన మాల జపానికి పనికిరాదు అనే సూత్రం ఈ తులసి మాలకు వర్తించదు. మనం చేసే జపం వల్ల మాలకు పవిత్రత కలుగుతుంది కనుక సంస్కారం అవసరం లేదు అని కొందరి వ్యంగ వాదన.. ఒక ద్రవ్యం ఒక దైవిక కైంకర్యానికి వినియోగించేముందు ఆ ద్రవ్యాన్ని సంస్కరించి మాత్రమే వినియోగించాలి. సింహీ అపరాజితా మహామంత్రాలయం తరఫున సాధకులకు ధారణ మరియూ జప వినియోగాలకు సహజ తులసి మాలలను 108 సార్లు శ్రీసూక్త పారాయణతో తో సంస్కారం చేసి అందుబాటులోకి తీసుకొచ్చినది. ఈ మాలలు పూర్తిగా సహజ సిద్ధమైనవి ( పోలిష్ చేయనివి ) మరియూ సంపూర్ణ సంస్కారం ఒసగబడినవి. ప్రామాణిక విధులు అనుసరించి ఈ తులసి మాల సంస్కారంలో పంచకవ్యములతో మార్జన నిర్వర్తించబడినది. మాలలను పూర్తిగా 3 రాత్రులు పంచకవ్యాలలో నానబెట్టినట్లైతే వినియోగంలో అతి కొద్దికాలానికి అని పెరిగిపోతాయి (తెగిపోతాయి) కనుక మాలా సంస్కారం లో పంచకవ్యాలను మార్జనకు పరిమితం చేయడం జరిగింది. ఈ తులసి మాల వినియోగం వల్ల సాధన, మానసిక స్థితి ప్రశాంతంగా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. 8సంవత్సరాలు ప్రవేశించినవారి లగాయతు ఏ వయస్కులు అయినా ఈ తులసి మాలను ధరించవచ్చు లేదా వినియోగించవచ్చు. తులసి మాల ధారణ చాలా ప్రశాంతతతో కూడిన జీవనస్థితి వర్చస్సును ప్రసాదిస్తుంది. ఈమాల బుధగ్రహ పీడను దోషాలను కూడా నియంత్రిస్తుంది. మంచి మరియూ మానసిక ప్రశాంతతనూ ఈ రుద్రాక్ష మారి ప్రసాదిస్తుంది. సాధనామార్గంలో ఉన్న స్త్రీలు ఈ తులసి మాల నిత్యం ధరించడం, వినియోగించడం వల్ల సాధన సవ్యంగా కొనసాగించుకునే అవకాశం లభిస్తుంది. మానసికోన్నతిని ప్రసాదించే ఈ తులసి మాల పురుషసూక్త విష్ణు సహస్రనామ పారాయణా యుక్తంగా మహావిష్ణు ఆరాధనతో సిద్ధపరచబడుతోంది ఈ తులసి మాల నిత్యం ధరించవచ్చు. పురుషులు నెలంతా మరియూ స్త్రీలు నెలసరి తరువాత 21 రోజులు నిస్సందేహంగా ధరించచ్చు.. స్త్రీలు నెలసరి రోజుల్లో తులసి మాల ధరించకూడదు. ముట్టుకోరాదు, ఈ మాల ధరించి ఉండగా మద్య, మాంసములు స్వీకరించకూడదు. మెరుగైన ఫలితాలకై తులసి మాల ధరించేటపుడు నమో నారాయణాయ అని జపిస్తూ ధరించడం ఉత్తమం. ప్రయాణ అసౌచం లేకుండా ఈతులసిమాల సంస్కరంచి మీకు అందించబడుతోంది.
Reviews
There are no reviews yet.