Description
7 ముఖి రుద్రాక్ష ధరించడం వల్ల సంపద, అదృష్టం, వ్యాపారంలో విజయం లభిస్తాయి, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, మానసిక ప్రశాంతత పెరుగుతుంది, శని మరియు శుక్ర గ్రహాల ప్రతికూల ప్రభావాల నుండి రక్షణ లభిస్తుంది, మరియు ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఇది ముఖ్యంగా వ్యాపారులు, ఉద్యోగులకు ప్రయోజనకరం, మరియు లక్ష్మీ దేవి ఆశీర్వాదాలను అందిస్తుంది .
చైతన్యం రక్షణ లేని గర్భాలయం వంటిది మన శరీరం . మనం ధరించే వనరులు మన శరీరం మీద ప్రతిష్టించే శక్తులు . అందుకే శరీరం మీద ప్రత్యేకంగా మెడ భాగం లో ఏదో ఒక ఆభరణం లేదా శక్తిని కలిగించే రుద్రాక్షలు ధరించడం మన శరీరానికి రక్షణ కలిగిస్తుంది .
రుద్రాక్ష ధారణ వల్ల మన బాహ్య ఆరా బలపడుతుంది అంతే కాకుండా శరీరం ప్రశాంతంగా ప్రకాశిస్తుంది . ఆధ్యాత్మిక మార్గం అన్వేషించేవారు శరీర రక్షణకు మరియు పవిత్రతకు రుద్రాక్ష మాలలను ధరిస్తారు . ఈ మాలలు సాధారణ విషతుల్య ప్రయోగాల ప్రభావాలను కూడా నిర్వీర్యం చేస్తాయని శాస్త్ర సారం . రుద్రాక్ష ధారణ వల్ల మనో నిగ్రహం కలిగి సాధనా మార్గం లో ఏర్పడే ప్రతికూలతలు మరియు ఇబ్బందులు తొలగి చక్కని సాధన కొనసాగుతుంది . ఈ రుద్రాక్ష మాలలు 108 విత్తనాలతో పాటు 1 మేరు పూస కలిగి ఉంటుంది . సాధారణంగా ఇవి దారంతో తయారు అవుతాయి కనుక దీర్ఘకాల మన్నిక కోసం వినియోగించే ముందే రాగి లేదా వెండి తీగతో చేయించుకుని పంచామృతాలతో మీ గృహంలో దేవతార్చన దగ్గర శుద్ధి చేసుకుని తొలిసారి సోమవారం రోజు ఉదయం బ్రాహ్మీ సమయంలో ధరించడం ఉత్తమం . సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున ఈ మాలలు ప్రోక్షణ సంస్కారం గావించబడి 6 కు పైగా సంస్కారాలు పూర్తి చేసుకుని మీకు చేరుతున్నాయి అని గమనించగలరు . ఇవి చాలా శక్తివంతమైనవి . కేవలం జపానికే కాక ధారణకు కూడా ఈ మాలలు ఉత్తమం . ఈ మాల ధరించి బైట పనులు వృత్తులు ఆచరించవచ్చు . స్త్రీలు కూడా ఈ మాలలు నెలసరి ముందు వరకు ధరించి నెలసరి దగ్గరలో తీసి ఇబ్బంది పూర్తి అయ్యాక 6 వ రోజు మరలా ధరించవచ్చు . ఈ రుద్రాక్షలు హిమాలయ శిఖరాలు మరియు నేపాల్ భూభాగం నుండి ఎక్కువగా గ్రహించబడతాయి , ఈ విభాగం నుండి గ్రహించిన మాల మీకు ఉత్తమ ఫలితాలను అందించాలని ఆశిస్తూ .. సింహీ అపరాజితా మహా మంత్రాలయం . అహం కమలానందనాధ .








Reviews
There are no reviews yet