Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- | Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- |
Previous
Previous Product Image

SINGLE RUDRAKSHA WITH SILVER CAP

Original price was: ₹1,200.00.Current price is: ₹999.00.
Next

JANA DHANAKARSHANA YANTRAM

Original price was: ₹5,000.00.Current price is: ₹2,999.00.
Next Product Image

LOTUS SEEDS ( TAAMARA MAALA )

Original price was: ₹1,000.00.Current price is: ₹499.00.

తామర పువ్వు సద్భావన, పవిత్రత, భక్తిని సూచిస్తుంది. తామర గింజలు లక్ష్మీ తత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ మాల ద్వారా జపం చేస్తే భక్తుడు దారిద్య్రం నుండి విముక్తి పొందుతాడు అని ప్రామాణిక వచనం .

Description

తామర మాల ను “కమల గట్ట మాల” అని కూడా పిలుస్తారు . ఇది తామర పువ్వు గింజలతో తయారు చేసిన పవిత్ర మాల. దీనిని మహాలక్ష్మీ దేవికి అత్యంత ప్రియమైనదిగా పరిగణిస్తారు. “కమలం” అంటే లక్ష్మీ దేవిని సూచిస్తుంది. కాబట్టి ఈ మాలతో జపం చేయడం వలన భగవతి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది . ఈ మాల ధారణకన్నా జపానికే ఎక్కువగా వినియోగిస్తారు . లక్ష్మీ ప్రదమైన మంత్రాలు జపం చేసేటప్పుడు ధన వృద్ధి కోసం , సౌభాగ్యం కోసం ఈ మాలను వినియోగిస్తారు .
ఈ మాల 108 తామర గింజలతో తయారు చేస్తారు . ఈ మాలకు సంస్కారం సింహీ అపరాజితా మంత్రం శాస్త్ర విభాగం లో నిర్వహిస్తారు . ఈ క్రమంలో  3 రోజులు గంగాజలం గోమూత్రం , పవిత్రోదకాలు వినియోగించి శ్రీసూక్త విధానంగా సంస్కారం నిర్వహిస్తారు .
ఈ మాల తామర గింజలు ఎండబెట్టిన తరువాత వాటిని దారం తో కట్టించి పవిత్రంగా తయారు తయారు చేయబడుతుంది .
ఈ మాలను వినియోగించడానికి మీరు మీ పూజా స్థలంలో పూజా సమయంలో లక్ష్మీ దేవి ముందు ఈ మాలను ఉంచి  ‘శ్రీం హ్రీం క్లీం శ్రీ సిద్ధ లక్ష్మియై నమః అనే మంత్ర జపం చేస్తూ కుంకుమ పూజ చేయాలి అలా 3 రోజులు నిర్వహించిన తరువాత అదే మంత్రం తో నిత్యం 108 కి పైబడి జపం ఆచరించాలి . ప్రతీ శుక్రవారం ఈ మాలపై కుంకుమ పూజ చేయడం వల్ల ఆర్ధిక పరమైన మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది  .
ఈ మాల మీకు చేరిన తరువాత   శుక్రవారం నుండి పూజలో ఉంచడం ఉత్తమం .
ప్రతీరోజు సూర్యోదయ సమయంలో ఈ జపం చేయడం శ్రేష్ఠం. ఈ మాలను సౌభాగ్యం కొరకు జపానికి వినియోగించేవారు “ఓం కమల వాసిన్యై నమః” అనే మంత్రాన్ని నిత్యం జపించడం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది .  ఈ మాల వినియోగం వల్ల  ఆర్థిక అభివృద్ధి ,ధనం, సంపద, సౌభాగ్యం పెరుగుతాయి. మానసిక ప్రశాంతత , మనస్సుకు శాంతి, భక్తి, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. లక్ష్మీ కటాక్షం కలిగి మీ  ఇంట ఐశ్వర్యం పెరుగుతుంది.

ఈ మాలను నేలపై ఉంచకూడదు. ఎప్పుడూ పూజా స్థలంలో ఉంచాలి. వాడిన తర్వాత పవిత్రంగా వస్త్రంలో చుట్టి ఉంచాలి. ఇతరులకు ఇవ్వకూడదు .

దీనిని వ్యక్తిగత మాలగా పరిగణించాలి. • తడి చేతులతో తాకకూడదు.

తామర పువ్వు సద్భావన, పవిత్రత, భక్తిని సూచిస్తుంది. తామర గింజలు లక్ష్మీ తత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ మాల ద్వారా జపం చేస్తే భక్తుడు దారిద్య్రం నుండి విముక్తి పొందుతాడు అని ప్రామాణిక వచనం .

Additional information

Weight 100 g

Reviews

There are no reviews yet

Add a review
Currently, we are not accepting new reviews