Description
మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మనల్ని చూసి మన స్థితిని చూసి ఓర్వలేని వారు చాలమందే ఉంటారు . ఇది మనందరికీ తెలిసిన విషయమే, ఈ స్థితి నుండి బైటపడటానికి రకరకాల ప్రయత్నాలు పరిహారాలు చేస్తూనే ఉంటారు . కానీ చాలా సులభంగా పిల్లల నుండీ పెద్దలవరకు ఎవరైనా ఈ స్ఫోటకాల నుండీ విముక్తులై రక్షించబడటానికి చాలా ప్రామాణికంగా సిద్ధ పరచబడినదే సర్వ రక్షాకరి ప్రత్యంగిరా హవన భస్మం. ఇది సాధారణంగా హోమ కుండం నుండి గ్రహించినది కాదు. స్ఫోటక బాధలు తొలగించడానికి నైమిత్తికాలలో ప్రత్యేకంగా న్యాస యుక్తంగా ధారణకొరకు సిద్ధపరచబడినది . 6 నెలలు నిండిన పిల్లల లగాయతు ఎవరైనా ఈ భస్మం ధారణకు వినియోగించవచ్చు. చిన్న పిల్లలు ఎక్కువగా రోదించడం, నిద్ర లేమి , భయపడటం వంటి ఇబ్బందులను కూడా ఈ భస్మ ధారణ నిలువరిస్తుంది. శుభ ఫలితాలకు ధారణా సమయంలో 11 సార్లు అంగిర గాయత్రి జపించి ధరించగలరు . అహం కమలానందనాధ!
Reviews
There are no reviews yet.