Description
Agulu Tilakam: అగులు నరఘోష, దృష్టి దోష, పరబాధలను శాంతింపజేయుటలో అగ్రగామి. ఈ అగులు ప్రామాణిక విధులు అనుసరించి అష్టగంధ మరియూ సహదేవీ మిశ్రితంగా తయారుచేయబడినది. 3 మాసాలు ప్రవేశించిన శశువుల లగాయతు ఏ వయస్కులు అయినా అగులు ఈ తిలకం ధరించవచ్చు. అగులు ఇడ, పింగళ, సుషుమ్మ అనే నాడీ వ్యవస్థలు కలిసే లలాట గ్రూమధ్య స్థానంలో ఎవరైనా తదేకంగా చూడటంవల్ల కలిగే దృష్టి దోషాలు ప్రాప్తించకుండా నియంత్రిస్తుంది. చిన్న పిల్లలు ఆస్తమాటూ రోదించడం, నిద్రలో ఉలిక్కిపడటం, భయపడటం వంటి పరిస్థితులు దృష్టి దోషాలకు సంకేతాలు. అగులు ఏ రకమైన దృష్టిదోషాలనైనా నియంత్రించి మంచి వర్చస్సును ప్రసాదిస్తుంది. సాధారణంగా అగులు కేవలం సగ్గుబియ్యం, లేదా బియ్యం నూకలతో చేస్తారు. అది సామాన్య ఫలితాలను మాత్రమే ఇవ్వగలుగుతుంది. సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున సిద్ధపరిచే అగులు కేవలం బియ్యం లేదా సగ్గుబియ్యంతో మాత్రమే కాకుండా దేవదారు. అసలైన గోరోచనం, కస్తూరీ, అగరు, కురువేరు తుంగదుంపలు మంచిగంధం కుంకుమపువ్వు సహదేవి వేరు తో ప్రామాణికంగా సిద్ధపరచబడుతోంది. సాధనామార్గంలో ఉన్నవారు ఈ అగులు నిత్యం ధరించడం వల్ల సాధనాపరమైన ప్రతికూలతలు తగ్గి సాధన సవ్యంగా కొనసాగించుకునే అవకాశం కలిగిస్తుంది. సాధారణ ప్రతిక్రియలను సైతం నిలువరించే విధంగా ఈ అగులు శూలినీ దుర్గా న్యాస యుక్తంగా సిద్ధపరచబడుతోంది ఈ అగులు నిత్యం ధరించవచ్చు, పురుషులు మరియూ స్త్రీలు నిస్సందేహంగా ధరించచ్చు. స్త్రీలు నెలసరి రోజుల్లో అగులు ధరించకూడదు. ముట్టుకోరాదు కొద్దిగా మధ్య వేలు తడి చేసుకుని ఆగులుని రుద్దగా లభించిన ధాతువుని ధరించవలెను. మెరుగైన ఫలితాలకై ఆగులు ధరించేటపుడు దుం దుర్గాయ నమః దృష్టిదోష నివారణం కురు నమ: అని జపిస్తూ ధరించడం ఉత్తమం. ప్రయాణ అసౌచం లేకుండా ఈ అగులును సంస్కరంచి మీకు అందించబడుతోంది. దుష్ప్రభావాల (నెగిటివ్ ఆరా) నియంత్రణకు, శని గ్రహ శాంతికి, సాధనా పటుత్వానికీ ఈ అగులును నమ్మకంగా ధరించవచ్చు.
Reviews
There are no reviews yet.