జపాలు

జపం అనేది మంత్రాలను నిర్దేశిత సంఖ్యలో ఉచ్చరించడం. జపం చేయడం ద్వారా మనస్సును ఏకాగ్రత చేయవచ్చు మరియు ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించవచ్చు.

సింహీ అపరాజితా మహా మంత్రాలయంలో వివిధ దేవతల మంత్రాలను జపించడానికి అవకాశం ఉంది. మా మంత్రాలయంలో అనుభవజ్ఞులైన పండితుల మార్గదర్శనంతో జపం చేయడం ద్వారా మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో అనేక ప్రయోజనాలు పొందవచ్చు.

మా మంత్రాలయాన్ని సంప్రదించి, మీ అవసరాలకు తగిన జపాన్ని ఎంచుకోండి.

సింహీ అపరాజితా మహా మంత్రాలయానికి స్వాగతం.
జపం .. ఈ పదానికి అనేక నిర్వచనాలు ఉన్నా.. సులభంగా చెప్పాలంటే ఆత్మకు వ్యాయామంగా అభివర్ణించవచ్చు. మన మానసిక సామర్ధ్యం బలహీనపడినపుడు, లౌకికంగా ఒడిదుడుకులు ప్రాప్తించినపుడు ఆ స్థితిని పునరుద్ధరించడానికి
పున: పున: ప్రేరణ చేయాల్సిన చైతన్య బీజ వాక్యాలనే జపం అని అంటారు.
మనం అనుభవిస్తున్న స్థితి ప్రభావాల అనుసారంగా ఈ జపాల సంఖ్యా ప్రమాణం మరియూ పద్దతీ ఆధరపడి ఉంటాయి. మనకి నయం కాని రోగ రుజన నివృత్తికి వైద్యులను ఆశ్రయించి వారి సూచన మేరకు నియమాలు పాటిస్తూ ప్రాప్తించిన రుజన బాధను ఎలాగైతే శమింపజేసుకునే అవకాశం ఉన్నదో.. అలానే మన వల్ల కాని మంత్ర ప్రేరణ ఆయా విధులు అభ్యసించిన పండిత సహకారంతో నిర్వర్తింపజేసుకుని శాంతిని పొందే మార్గమే జప నిర్వహణ ..
సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున నవగ్రహ, నక్షత్ర, ఆమ్నాయ మూలమంత్ర జపములు నిర్వహించుకునే అవకాశం కల్పిస్తోంది.
ఇందులో వ్యక్తికి సూచించిన జప ఆవశ్యకత రీత్యా మహా గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, పంచకవ్య ప్రాశన, ఆచార్య ఋత్విక్ వరుణ ప్రదానం, మండపారాధన, విద్యుక్త ఉపచార పూజ, జప నిర్వహణ ఉంటాయి.
జప విధులు పూర్తి అయ్యాకా, తద్దశాంశ సూచిత ద్రవ్య తర్పణం, అలానే తర్పణ సంఖ్యలో పదవ వంతు హోమ, మార్జనాలు నిర్వహించబడతాయి.

మరిన్ని వివరాలకు పీఠం నెంబర్ 9505090595 పై వాట్సాప్ ఛాట్ చేసి తెలుసుకోగలరు...