హోమాలు

సింహీ అపరాజితా మహా మంత్రాలయంలో వివిధ రకాల హోమాలు నిర్వహించబడతాయి. లౌకిక కామ్య హోమాలు అంటే వైదిక పరమైన నవగ్రహ, నక్షత్ర శాంతి హోమాలు మరియూ తాంత్రిక పరమైన హోమలు అంటే దక్షిణ కాళీ, ప్రత్యాంగిర, కాలభైరవ, వనదుర్గా మహావిద్యా హోమం, దశ మహావిద్యల హోమాలు, చండీ, రుద్ర, పాశుపత హోమాలు ఆసక్తుల కోరిక, అవసరం మేరకు నిర్వహించబడతాయి. ఈ విభాగం 3 సహస్ర చండీ యాగాలు 100 మందికి పైగా పండిత సహకారంతో నిర్వహించిన ఘనత కలిగినది. హోమం అంటే ప్రత్యక్షంగా దేవీ దేవతలకు పదార్ధం తో పాటు మన భక్తిని సమర్పణ చేసే ఒక చక్కని విధానం. మనం ఎలాంటి శుద్ధమైన పదార్ధాలు మన శరీర పోషణకు ఉపయోగిస్తామో అలాంటి నాణ్యమైన ద్రవ్యాలు హోమాలలో పవిత్రంగా వినియోగించాలి అనే సూత్రాన్ని పాటిస్తూ ఈ విభాగంలో హోమాలు నిర్వహిచబడతాయి. జప సమర్పణకు ఉన్న ఏకైక మార్గం హోమం కనుక అనుభవజ్ఞులైన పండిత సహకారంతో ఈ హోమ విధానాలు పీఠం నిర్వహిస్తోంది.

దేవతలకు ప్రత్యక్షంగా యజ్ఞఫలం అందించే మార్గాలలో ఉన్నతమైనది హోమ విధానం. ఈ హోమములో “ దేవానాం ఆజ్యం ఆహారం“ (ఆజ్యం) అంటే నెయ్యి దేవతలకు ఆహారం వంటిది అని అర్ధం. కేవలం నెయ్యి మాత్రమే కాకుండా నేతిలో బియ్యాన్ని వేయించి అన్నంగా వండిన పదార్ధాన్ని హవిస్సు అంటారు. ఆ హవిస్సు కూడా హోమం లో ఉపయోగించే ప్రధాన ద్రవ్యం. ఈ ద్రవ్యాలనే దేవతలు ఆహారంగా స్వీకరిస్తారు అని శాస్త్ర వచనం. హోమాన్ని బట్టి కొన్ని రకాల ద్రవ్యాలు ప్రామాణికంగా సూచించబడ్డాయి. పీఠం లో అలా ఆయా హోమాలకు సూచించిన ద్రవ్యాలతో హోమ విధానాలు నిర్వహించబడతాయి.
మనం ఒక మంచి ఆహార పదార్ధాన్ని తయారు చేయాలంటే అందులో ఉపయోగించే వనరుల నాణ్యత ఎంత ముఖ్యమో… మనం ఆచరించే హోమం దేవతలు తృప్తిగా స్వీకరించి మంచి ఫలితాలు ఒసగాలంటే మన భక్తి శ్రద్ధలతో పాటు హోమం లో ఉపయోగించే పదార్ధాల నాణ్యత కూడా అంటే ముఖ్యం. సింహీ అపరాజితా మహా మంత్రాలయ యాగ స్థలిలో శుభ్రమైన, శుద్ధమైన ద్రవ్యాలతో అనుభవజ్ఞులైన పండితుల సహకారంతో హోమాలు నిర్వహించబడతాయి.

గుల్లగా ఉన్న, అద్దెకు తెచ్చుకున్న ఇనుప హోమ కుండాలు హోమం చేయడానికి పనికిరావు. శాస్త్రం లో సూచించిన విధంగా హోమాలు ఆచరిస్తే ఫలితాలు తప్పక కలుగుతాయి. కాలమాన అనుసారంగా మన సౌకర్యం అనుసరించి చేసే కార్యక్రమాలు హోమాలు సంపూర్ణమైన ఫలితాలు ఇవ్వలేవు. ప్రామాణిక పద్ధతిలో హోమాలు ఆచరించడం శ్రేయోదాయకం. పీఠం తరఫున ఆసక్తులు వివిధ హోమలు ఆచరించుకోడానికి వీలుగా షత్పాత్రమ్, చతుష్పాత్రమ్, లౌకికాగ్ని విధానాలలో అగ్ని ప్రతిస్ట గావించి పరిపూర్ణ అనుభవం కలిగిన పండితులచేత హోమాలు నిర్వహించబడతాయి. పీఠం తరఫున నిర్వహించే హోమాల వివరాలు పట్టికలలో పొందుపరచబడ్డాయి, వాటి ఖర్చుల వివరాలకు పీఠం నంబర్ పై వాట్సప్ మెసెజ్ చేసి తెలుసుకుని సూచించిన రుసుము ముందస్తుగా చెల్లించి మీరు కోరుకున్న లేదా సూచించిన రోజుల్లో యాగస్థలికి హాజరు అయ్యి కార్యక్రమం ఆచరించగలరు. సుదూరాలలో ఉన్నవారు కొన్ని హోమాలు పరోక్షం గా ఆచరించే అవకాశం పీఠం కల్పించింది. వారి అభ్యర్ధన మేరకు ఆ కార్యక్రమం పీఠం నెంబర్ నుండి వీడియో కాల్ ద్వారా వీక్షించే వెసులుబాటు కూడా కల్పించబడింది.

చండీ హోమం/కలాపం

కలౌ చండీ వినాయకః అంటే కలియుగంలో చండీ మరియూ గణపతి మంత్రములు, ఆరాధనలు కలి ప్రభావానికి లోనుకాకుండా విశేషమయిన ఫలితములు అందజేసేవి

Read More »

మహా గణపతి హోమం

మహా గణపతి మూలమంత్ర, అష్ట ద్రవ్య హోమము ఈ హోమాన్ని చాలామంది లక్ష్మీగణపతి హోమంగా అభివర్ణిస్తారు, కానీ ప్రామాణిక విధులలో ఇది

Read More »

మహా మృత్యుంజయ హోమం

మహా మృత్యుంజయ హోమం: త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం, ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీ యమామృతాత్ జీవికి తన జీవితంలో అత్యంత విలువైనది

Read More »

నవగ్రహ శాంతి హోమం

నవగ్రహ హోమం: ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ: హిందూ సనాతన జీవనంలో ప్రకృతితో

Read More »

రుద్ర హోమం

రుద్ర హోమం ఈశాన: సర్వ విద్యానాం ఈశ్వరస్సర్వ భూతానాం… సంకల్పించిన కార్యాలలో శివానుగ్రహం తోడైతే విజయమే వరిస్తుంది. సర్వ కామ్యప్రదం, సర్వ

Read More »