అభిషేకాలు

సింహీ అపరాజితా మహా మంత్రాలయంలో వివిధ దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి పవిత్రమైన అభిషేకాలు నిర్వహిస్తారు. అభిషేకం అనేది దైవ శక్తిని ఆహ్వానించి, దేవతలను పూజించే ఒక ఆధ్యాత్మిక క్రతువు. పవిత్రమైన జలాలతో దేవత విగ్రహాలను అభిషేకించడం ద్వారా, భక్తులు దైవ ఆశీర్వాదాలు పొందవచ్చు.

మా మంత్రాలయంలో నిర్వహించే అభిషేకాలు శాస్త్రోక్తంగా, అనుభవజ్ఞులైన పండితుల ఆధ్వర్యంలో జరుగుతాయి. అభిషేకం చేయడం వల్ల భక్తులకు మానసిక శాంతి, ఆరోగ్యం, సుఖం, సమృద్ధి లభిస్తాయి. అలాగే, వారి జీవితంలోని సమస్యల నుండి విముక్తి పొందుతారు.

మా మంత్రాలయాన్ని సంప్రదించి, మీ అవసరాలకు తగిన అభిషేకాన్ని బుక్ చేసుకోండి.

సింహీ అపరాజితా మహా మంత్రాలయానికి స్వాగతం.
సాంబసదాశివుని దివ్య కృపను పొందుటకు శాస్త్రం తెలియజేసిన అత్యంత సులభ విధి ఈశ్వర అభిషేకం
ఇహానికి సంబంధించి ప్రాప్తించిన ఈతిబాధలతో పాటు మన స్థితికి పరోక్షముగా ప్రభావం చూపే కర్మబాధలను సైతం హరించే లక్షణం ఈశ్వరాభిషేకానికి ఉంటుంది.
జాతకరీత్యా, గోచార రీత్యా ప్రాప్తించే సమస్త గ్రహబాధలూ శాంతింపజేయుటకు శివానుగ్రహం తప్పనిసరి.
మనకు ప్రాప్తించే ఏ దుష్కృతినైనా అది ఎలా ప్రాప్తించిందో తెలియని పక్షంలో కూడా ఆ స్థితిని శాంతింపజేయగలిగినది ఈశ్వరారాధన మాత్రమే..
అలాంటి ఉత్తమ ఫలితాలను ఒసగే ఈశ్వరారాధనలో ఉత్తమోత్తమ మార్గం రుద్రాభిషేకం.
సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున మరకత శక్తేయ లింగానికి ఆరుద్రా నక్షత్రం, ప్రతీ మాసం లో వచ్చే
అన్ని సోమవారాలలో పర్వాలలో అభీష్ట దివసాలలో ఏకవార, ఏకాదశ రుద్రాభిషేకాలు శాస్త్ర అభ్యాసం చేసిన ఉత్తమ పండిత సహకారంతో శుద్ధమైన ద్రవ్యాలతో నిర్వహించుకునే వెసులుబాటు కల్పిస్తోంది.
ఈ విభాగం లో ఆసక్తులు ప్రత్యక్ష, పరోక్ష పద్ధతులలో రుద్రాభిషేకం నిర్వహించుకోవచ్చు.
ప్రత్యక్షముగా ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు సంప్రదాయ దుస్తులు ధరించి 2 వొలిచిన కొబ్బరికాయలు, విడిపువ్వులు తీసుకుని ఆలయానికి సూచించిన సమయంలో హాజరు కాగలరు.
మన ఇంట్లో పుట్టిన రోజు, పెళ్లి రోజువేడుకలకు క్షణికమైన దుర్వనియోగపు ఖర్చుని దైవ కృప వర్షించే క్రతువులకు కేటాయంచి సత్కార్యాలకు వెచ్చించి ఈ విలువైన జన్మకు ఆధ్యాత్మిక చరితార్ధాన్ని కలిగిద్దాం..

మరిన్ని వివరాలకు పీఠం నెంబర్ 9505090595 పై వాట్సాప్ ఛాట్ చేసి తెలుసుకోగలరు...