కలాపాలు

సింహీ అపరాజితా మహా మంత్రాలయంలో శక్తివంతమైన కలాపాలను నిర్వహిస్తారు. కలాపం అనేది పలువురు పండితులు కలిసి నిర్వహించే ఒక విస్తృతమైన ఆధ్యాత్మిక క్రతువు. ఈ క్రతువులో వివిధ దేవతలను ఆరాధిస్తూ, వారి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. కలాపం చేయడం వల్ల వ్యక్తిగత, కుటుంబ లేదా సామాజిక సమస్యలను పరిష్కరించుకోవడానికి, మంచి ఆరోగ్యం, సుఖశాంతి, సమృద్ధి లాంటి ఫలితాలను పొందడానికి సహాయపడుతుంది.

మా మంత్రాలయంలో అనుభవజ్ఞులైన పండితులు కలిసి శాస్త్రోక్తంగా కలాపాలను నిర్వహిస్తారు. మీ అవసరాలకు తగిన కలాపాన్ని ఎంచుకునేందుకు మా మంత్రాలయాన్ని సంప్రదించండి.

సింహీ అపరాజితా మహా మంత్రాలయానికి స్వాగతం.
“కలాపం”:
హోమము లేదా ఒక కార్యక్రమాన్ని సద్యస్కాలం అంటే ఒకే రోజులో సూక్ష్మంగా పూర్తి చేయడం ఒక సాధారణ పద్ధతి అయితే .. ఆ కార్యక్రమం సంపూర్ణంగా ఒక రోజు కన్నా ఎక్కువగా నిర్వహించడం కలాపంగా అభివర్ణించవచ్చు.
ఈ కలాపాలు సాధారణంగా 3 రోజులు లేదా అంతకన్నా ఎక్కువ రోజులు నిర్వహించబడుతూ శక్తిని తీవ్రంగా ప్రేరేపించగలుగుతాయి.
తద్వారా ఆశించిన ఫలితాలు కర్త పొందగలుగుతారు.
కలాపం అనేది సాధారణంగా ఒకరికన్నా ఎక్కువ పండిత సహకారాన్ని కలిగిఉంటుంది.
సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫునఈ కలాపాలలో ప్రధానంగా చండీ. అంగిర, వారాహీ, శ్యామల, బగళ, వనదుర్గ, రుద్ర, గణపతి, సుబ్రహ్మణ్య, శూలినీ వంటివి ఆచరించబడతాయి.
శీఘ్ర ఫలితాలకోసం సాధారణ హెూమాలకన్నా కలాపాలు ఆచరించడం ఉత్తమంగా శాస్త్రం అభివర్ణించింది.
మనం ఎంచుకున్న మార్గంలో ఖశ్చితమైన ఫలితాలు ప్రాప్తింపజేయుటలో కలాపాలది అగ్రస్థానం గా చెప్పవచ్చు.
ఒకే తరగతి గదిలో ఉన్న విద్యార్థులకు ఒకే రకమైన ఫలితాలు ఎలాగైతే రావో.. దైవిక చైతన్య ప్రేరణ. కలాప నిర్వహణ చేసిన వారందరికీ ఒకే రకమైన ఫలితాలు ప్రాప్తించకపోవచ్చు. కానీ చాలా కలాపాలు సత్ఫలితాలనే ఇచ్చాయి అనేది అనుభవ సారం. యోగ కర్మ ప్రభావాలమీద కలాప ఫలితాలు ఆధారపడి ఉంటాయి అని గమనించగలరు.
ఇందులో వ్యక్తికి సూచించిన కలప ఆవశ్యకత రీత్యా మహా గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, పంచకవ్య ప్రాశన, ఆచార్య ఋత్విక్ వరుణ ప్రదానం, మండపారాధన, విద్యుక్త ఉపచార పూజ, జప నిర్వహణ ఉంటాయి. 2 వ రోజు లగాయతు కలాపం పూర్తి అయ్యేవరకు మంత్ర ప్రేరణ నిర్వహించి, చివరి రోజున హవనాది కార్యక్రమాలు ఆచరించబడతాయి.

మరిన్ని వివరాలకు పీఠం నెంబర్ 9505090595 పై వాట్సాప్ ఛాట్ చేసి తెలుసుకోగలరు...