పారాయణలు
పారాయణం అనేది పవిత్రమైన గ్రంథాలను చదవడం మరియు జపించడం. పారాయణం చేయడం ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పొందవచ్చు మరియు దైవ చైతన్యంతో అనుసంధానం పొందవచ్చు. మా మంత్రాలయంలో అనుభవజ్ఞులైన పండితుల మార్గదర్శనంతో పారాయణం చేయడం ద్వారా మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో అనేక ప్రయోజనాలు పొందవచ్చు.
మా మంత్రాలయాన్ని సంప్రదించి, మీ అవసరాలకు తగిన పారాయణాన్ని ఎంచుకోండి.
సింహీ అపరాజితా మహా మంత్రాలయానికి స్వాగతం.
“పారాయణలు “:
సింహీ అపరాజితా మహా మంత్రాలయం శాస్త్రోక్తమైన జపాలు, హెూమాలు, కలాపాలతో పాటు శాస్త్రం సూచించిన అత్యంత శక్తివంతమైన పారాయణా విధులు కూడా నిర్వహిస్తోంది. జటిలమైన సమస్యల పరిష్కారానికి అనేక పారాయణా విధుల ఆచరణను శాస్త్రం ఆమోదించింది. అటువంటి పారాయణా విధులు సైతం పీఠం లో నిర్వహించే వెసులుబాటు కల్పిస్తోంది. సుందరకాండ పారాయణ, మహా విద్యా వనదుర్గా పారాయణ, చండీ సప్తశతీ పారాయణ, ప్రత్యంగిరా ఋక్ పారాయణ, దత్త చరిత పారాయణ వంటి అనేక పారాయణలు ఆసక్తుల కొరకు నిర్వహించబడుతున్నాయి.
ఈ పారాయణలు కొన్ని సద్యస్కాలం అంటే ఒకే రోజులో సూక్ష్మంగా పూర్తి కాగా.. కొన్ని పారాయణలు సంపూర్ణంగా ఆచరించుటకు 3 కన్నా ఎక్కువ రోజులు పట్టవచ్చు. రోజుల నిర్ణయం ఆయా పారాయణలపై ఆధారితం. శీఘ్ర ఫలితాలకోసం సాధారణ జపాలు ఆచరించడం కన్నా పారాయణలు ఆచరించడం ఉత్తమంగా శాస్త్రం అభివర్ణించింది. యోగ కర్మ ప్రభావాలమీద కార్యక్రమ ఫలితాలు ఆధారపడి ఉంటాయి అని గమనించగలరు. ఇందులో వ్యక్తికి సూచించిన పారాయణ ఆవశ్యకత రీత్యా మహా గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, పంచకవ్య ప్రాశన, ఆచార్య ఋత్విక్ వరుణ ప్రదానం, మండపారాధన, విద్యుక్త ఉపచార పూజ, పారాయణ నిర్వహణ ఉంటాయి. 2వ రోజు లగాయతు కార్యక్రమం పూర్తి అయ్యేవరకు పారాయణ నిర్వహించి, చివరి రోజున మార్జన లేదా హవనాది కార్యక్రమాలు ఆచరించబడతాయి.