రుద్ర హోమం

రుద్ర హోమం ఈశాన: సర్వ విద్యానాం ఈశ్వరస్సర్వ భూతానాం… సంకల్పించిన కార్యాలలో శివానుగ్రహం తోడైతే విజయమే వరిస్తుంది. సర్వ కామ్యప్రదం, సర్వ దోషనివాణం ఒసగే సదాశివ కృపకోసం, జాతకరీత్యా, గోచారరీత్యా ఏలినాటిశని. హస్తంగత గ్రహబాధా నివారణార్ధం, స్ధంభన దోషములు తొలగుటకు, మాసనిక బలం, సాధనా పటుత్వం ప్రాప్పించుటకు శివారాధన అత్యున్నతమైనది. ఏదో ఒక కోరిక కోసం కాకుండా జీవితం ఉద్దరించబడటం కోసం పాపప్రక్షాళణకు రుద్రహోమం ప్రామాణికంగా చెప్పబడింది.

సాధారణ రోజుల్లో కాన్నా ఆరుద్రా నక్షత్రం, లేదా ఏదేనీ సోమవారాలలో రుద్రహోమం ఆచరించడం సర్వోత్తమంగా చెప్పబడినది. జాతకరీత్యా, గోచారరీత్యా శని గ్రహం బలహీనంగా ఉన్నా.. వక్ర దృష్టి తో ఉన్నా.. శని మహర్దశ, అంతర్దశా కాలంలో ఏలినాటి శని ప్రభావ కాలంలో రుద్ర హోమం సానుకూల ఫలితాలు ఒసగుతుంది. సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున రుద్రహోమం ఆసక్తులైన కర్తల సౌకర్యార్థం ప్రతీ నెలా సోమవారాలలో మరియూ ఆరుద్రా నక్షత్రం రోజున నిర్వహించుక వెసులుబాటు కల్పించింది. రుద్రయామళ పాశుపత అనుసంధాన రుద్రహోమం మరియూ సాధారణ రుద్రహోూమము అనే 2 విధానాలు ఈ రుద్రహోూమ విభాగంలో ఎంచుకోవచ్చు.

సాధారణ రుద్రహోమం: ఈ విధానం లో గణపతి పూజ, లౌకికాగ్ని ప్రతిష్ఠాపన, నమక ప్రశ్న చమకానువాక హోమం మహా పూర్ణాహుతి అనే క్రమాలు ఉంటాయి. సుమారు గంటన్నర సమయం ఈ హోమం నిర్వర్తించడానికి వడుతుంది. నమోదు చేసుకొనుటకు…

రుద్రయామళ పాశుపత రుద్రహోమం: ఈ విధానం లో గణపతి పూజ, లౌకికాగ్ని ప్రతిష్టాపన, నమక ప్రశ్న చమకాసువాక యామళ పాశుపత యుక్త హెూమము మహా పూర్ణాహుతి అనే క్రమాలు ఉంటయి. సుమారు మూడు గంటల సమయం ఈ హోమం నిర్వర్తించడానికి పడుతుంది. నమోదు చేసుకొనుటకు…

సుదూరాలలో ఉన్నవారు వారి గోత్ర నామాదులతో పరోక్షంగా పీఠం సూచించిన బ్రహ్మ గారి సహకారంతో ఈ కార్యక్రమం ఆచరించే వెసులుబాటు కల్పించబడినది. దానిని వారు వీడియో కాల్ ద్వారా వీక్షించే అవకాశం కల్పించబడినది.

Categories

Follow Us

Leave a Reply