ప్రామాణిక ప్రత్యంగిరా హోమం

శ్రీ సింహీ అపరాజితా మహా మంత్రాలయ సగర్వ సమర్పణలో ప్రత్యంగిరా పరమేశ్వరీ ప్రీత్యర్థం దక్షిణాచార అంగిర హవనం శరవణభవాలయ ప్రాంగణంలో వాయు ప్రతిష్ఠాపన గావించబడిన శ్రీ ప్రత్యంగిరా పరమేశ్వరి దేవి సన్నిధిలో నిర్వహించబడుతున్నది.
నరఘోష, పరప్రయోగ బాధలు, ఆశాభంగం, చివరి వరకూ వచ్చిన పనులు ఆగిపోవడం, దృష్టి దోషాలు, అసంకల్పిత మానసిక రోగాలు, అధికార ఒత్తిడి, ఏలినాటి శని దోషం వంటి ఇబ్బందులు ఉన్నవారు ఈ హెూమం ఆచరించుటవల్ల ఆ దుష్ప్రభావాలు శాంతించి ఉపశమనం మరియూ సుఖ జీవనం పొందగలరు. ఈ హెూమం నైమిత్తిక తిథి ప్రాధాన్యత కలిగినది.

అంటే శుద్ధంలో అష్టమి, బహుళ అష్టమి, పున్నమి, మాసశివరాత్రి, అమావాస్య తిథులలో ఆచరింపదగినది. ఇక పర్వాలు సంకల్పిత అభీష్ట రోజుల్లో కూడా ఆచరించవచ్చు. నైమిత్తికాలలో అవకాశం కుదరనివారు ఆదివారం రోజు ఆచరించవచ్చు. పీఠం తరఫున ఈ హోమం వ్యక్తిగతమైనది. సామూహికం కాదు. ఈ హెూమం ఆచరించుటకు నమోదు చేసుకున్న వారు జంటగా కూర్చోనవసరం లేదు. సూచిత సమయంలో ఆలయానికి రావలెను. కార్యక్రమం సుమారు ఒక గంట సమయం ఉంటుంది. ఆలయంలో వసతి సదుపాయం ఉండదు అని గ్రహించగలరు.

హోమంలో పాల్గొనేవారు సంప్రదాయ దుస్తులు (పురుషులు పంచ కండువా, స్త్రీలు చీర, చుడీదార్) ధరించవలెను. హోమానికి వచ్చేటప్పుడు 2 ఒలిచిన కొబ్బరికాయలు మరియు విడి పువ్వులు విధిగా తీసుకుని రావలెను. ఈ హోమం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆచరించుటకు 12000రూ. పీఠానికి ముందస్తు చెల్లింపు చేసి నమోదు చేసుకోవలెను. సుదూరాలలో ఉన్నవారు వారి గోత్ర నామాదులతో పరోక్షంగా పీఠం సూచించిన బ్రహ్మ గారి సహకారంతో ఈ కార్యక్రమం ఆచరించే వెసులుబాటు కల్పించబడినది. దానిని వారు వీడియో కాల్ ద్వారా వీక్షించే వెసులుబాటు కల్పించబడినది.

Leave a Reply