నవగ్రహ హోమం: ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ: హిందూ సనాతన జీవనంలో ప్రకృతితో పాటు సమస్త ప్రాణకోటికీ జీవనాధారమైన సూర్యునితో కూడి 9 గ్రహాలనూ దైవభావంతో ఆరాధించడం ఒక ఉన్నత సంప్రదాయమగా కొనసాగుతోంది. గ్రహ గమన అనుసారమగా నిర్మితమైన పంచాంగ గణితం నేటికీ పాశ్చాత్యుల సాంకేతికతకు సైతం సవాలు విసురుతోంది. కొంతమంది స్వార్ధపూరిత అవతార సిధ్ధాంతుల వలలో పడి నలిగి విసిగిపోయిన వారు కొదరైతే, అవగాహన లేక ఏది ఎలా వినియోగించాలో తెలియక నష్టపోయేవారు. సత్ఫలితాలు పొందలేనివారు మరికొందరు.
ఏది ఏమైనా ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు సూచించిన మార్గాలలో నేటికీ తప్పులు లేవు. గ్రహాలు ప్రత్యేకంగా ప్రకృతి మరియూ మానవ జీవన గమనం పై అధిక ప్రభావాలు చూపుతాయి. జాతకరీత్యా, గోచార రీత్యా గ్రహ పాలన సక్రమంగా లేనపుడు వాటి ప్రభావాలు మొదట మానసికంగా దానిద్వారా శారీరకంగా లౌకికంగా ప్రభావాలు చూపిస్తాయి. గ్రహ గమనంలో మార్పులు గమనించినపుడు యోగ్యుడైన, శాస్త్ర నిష్ణాతుడైన పండితుడని ఆశ్రయించి ప్రామాణిక గ్రహశాంతి ఆచరించడం ఉత్తమం. ప్రస్తుత రోజుల్లో కేవలం నవగ్రహ వేదమంత్రం చదవడం వచ్చినవారు సైతం నవగ్రహ శాంతి పూర్వక జపాలలో పాల్గొనడం, వాటిని ఆచరించడం జరుగుతోంది. శాస్త్ర విధులలో నిష్ణాతులైన పండిత సహకారంతో ఒసగే గ్రహశాంతులు సత్ఫలితాలను ఇస్తాయి అని చెప్పబడింది. అటువంటి చక్కని పండిత సహకారంతో గ్రహశాంతి ఆచరించుటకు పూర్తి వెసులుబాటుని కల్పిస్తూ సింహీ అపరాజితా మహా మంత్రాలయం నవగ్రహ శాంతి పూర్వక నవగ్రహ హెూమాలు నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొనే పండితులు స్మార్త, వేదశాస్త్ర, మంత్రశాస్త్ర పండితులు మాత్రమే ఉంటారు.
నవగ్రహ ప్రోక్తములో సూచించిన సమిధలు, గ్రహ ధాన్యాలు, వస్త్ర వర్ణ నియామాలు, సూచిత దానాలు, ప్రామాణిక ద్రవ్యాలు వినియోగిస్తూ నవగ్రహ శాంతి విధిని సంపూర్ణంగా పీఠము ద్వారా ఆచరించ్చు.
సాధారణ నవగ్రహ హోమం: ఈ విధానం లో గణపతి పూజ దశ గుణిత వైదిక మంత్ర జపార్థం వరుణ ప్రదానం, జపనిర్వహణ, స్వస్తి పుణ్యాహవాచనం, నవగ్రహ మండపారాధన, దశ గుణిత వైదిక మంత్ర హోమం, మహా పూర్ణాహుతి అనే క్రమాలు ఉంటయి. సుమారు 3 గంటల సమయం ఈ కార్యక్రమం నిర్వర్తించడానికి పడుతుంది. నమోదు చేసుకొనుటకు…
సంపూర్ణ నవగ్రహ కలాపం: ఈ విధానం లో మొదటిరోజు గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, పరిషత్ ప్రాయశ్చిత్తం, కృఛ్రత్రయ దానాలు, ఆచార్య,ఋత్విక్ వరుణ ప్రదానం, దిక్పాలక, నవగ్రహ ఆవాహన (ఒక్కో గ్రహానికి ఒక్కో సూచిత వస్త్ర వర్ణ యుక్త తత్ ధాన్య మండపం ) ఆరాధన నవగ్రహ వైదిక మంత్ర పారాయణ నిర్వర్తించబడతాయి. నమోదు చేసుకొనుటకు…