మహా గణపతి మూలమంత్ర, అష్ట ద్రవ్య హోమము ఈ హోమాన్ని చాలామంది లక్ష్మి గణపతి హోమంగా అభివర్ణిస్తారు, కానీ ప్రామాణిక విధులలో ఇది మహా గణపతి హోమం. ఇది 2 రకాలు. ఒకటి మహా గణపతి మూలమంత్ర హోమం, మరొకటి మహా గణపతి అష్ట ద్రవ్య హోమం. ఈ హోమం సర్వులూ ఆచరించవచ్చు. ధర్మబద్దమైన కామ్యాలు ఈ హవన ఆచరణ వల్ల సిద్ధిస్తాయి. “కలౌ చండీ వినాయక:” కలిలో మానవులు ఆచరించే ప్రతీ క్రతువులో ప్రతీ హోమంలో కలిపురుషుడికి వాటా ఉంటుంది. కేవలం గణపతి మరియూ చండీ ఆరాధన, అర్చన, హవనాలకు మాత్రం కలి ప్రమేయం ఏ మాత్రం ఉండదు. ఆయా క్రతువుల వల్ల లభించే సంపూర్ణ ఫలితం కర్తకు ప్రాప్తిస్తుంది. తలపెట్టిన కార్యాలు మధ్యస్తంగా ఆగిపోతున్నప్పుడు, అన్ని వనరులూ ఆలోచనా ఉన్నా పనులు ప్రారంభం కానప్పుడు, విఘ్న బాధలు ప్రాప్తించి కార్యస్థంభన చేస్తున్నప్పుడు, ఆశాభంగం కలుగుతున్నప్పుడు ఈ హోమం ఆచరించడం వల్ల ఆ స్థితి శాంతించి సత్ఫలితాలు పొందవచ్చు. ఇక విద్య లో ఉత్తీర్ణతకు, సదుద్యోగ సిద్ధికి, జీవన స్థిరత్వం కొరకు, ఆర్థిక వృద్ధికి, మానసిక ప్రశాంతతకు, వివాహ సిద్ధి, మంగళప్రదమైన జీవనశైలికి, దాంపత్య సంతాన వృద్ధికి ఈ హోమ ఆచరణ ఉత్తమం. జాతకరీత్యా, గోచారరీత్యా కేతు గణము బలహీనంగా ఉన్నా.. వక్ర దృష్టి తో ఉన్నా.. కేతు మహర్దశ, అంతర్దశా కాలంలో గణపతి హోమం సానుకూల ఫలితాలు ఒసగుతుంది. ఈ హోమం 2 రకాలుగా చెప్పబడింది. ఒకటి మహా గణపతి మూల మంత్ర ప్రామాణిక ఆజ్య హోమం. రెండొవది మహా గణపతి అష్టద్రవ్య హోమము. మహాగణపతి మూలమంత్ర హోమం వల్ల లభించే ఫలితానికి సుమారు 4 రెట్లు అధిక ఫలితం అష్టద్రవ్య హోమం ప్రసాదించగలుగుతుంది. ఈ రెండు హోమాలలో మూలమంత్రం ఒకటే అయినా వినియోగించే వనరులు, ఆచరణ పద్దతులలో తారతమ్యం వల్ల ఫలితాలలో మార్పులు ఉంటాయి. పీఠం తరఫున ఈ హోమం నమోదు చేసుకున్న వారి కొరకు సంకటహరచవితి రోజున నిర్వహించబడుతుంది. ఈ హోమంలో కర్త ప్రత్యక్షంగా పాల్గొనవచ్చును. ప్రామాణిక విధులతో గతంలో ఈ మంత్ర పురశ్చరణ గావించిన పండిత సహకారంతో, శ్రేష్టమైన ద్రవ్యాలతో ఈ హోమాలు నిర్వహిమచబడతాయి.
నమోదు కొరకు
మాహాగణపతి మూలమంత్ర హోమము (ఇద్దరు పండితుల ద్వారా నిర్వహణ)
మహా గణపతి మూలమంత్రముతో షట్పాత్ర, చతుష్పాత్ర, లౌకికాగ్ని ప్రతిష్టాపనల్లో ఆమోదయోగ్యమైన విధానం తో ఆజ్యము, హవిస్సు, యవలు మరియూ అష్టద్రవ్యాలుగా చెప్పబడే ఉండ్రాళ్ళు, సత్తుపిండి ఉండ్రాళ్లు, అటుకులు, ధాన్యం పేలాలు, బెల్లం, చెరకు, నువ్వులు, కొబ్బరి వీటిని అష్ట ద్రవ్యాలుగా తెలియజేస్తారు బెల్లము మరియూ చెరకు సజాతి వనరులు కనుక గరికను ఉపయోగించడం కూడా ఆచారంగా ఉన్నది. ఈ ద్రవ్యాలను ఉపయోగించి సహస్రాధిక సంఖ్యాకముగా సుమారు 2 గంటలు ఈ హోమం నిర్వర్తించబడుతుంది.. నమోదు చేసుకొనుటకు
నమోదు కొరకు
మహా గణపతి అష్టద్రవ్య హోమము (ఇద్దరు పండితుల ద్వారా నిర్వహణ)
మహా గణపతి మూలమంత్రముతో లౌకికాగ్ని ప్రతిష్టాపనతో ఆజ్యము, హవిస్సు, యవలు ఉపయోగించి సహస్రాధిక సంఖ్యాకముగా సుమారు 2 గంటలు ఈ హోమం నిర్వర్తించబడుతుంది.. నమోదు చేసుకొనుటకు..