కలౌ చండీ వినాయకః అంటే కలియుగంలో చండీ మరియూ గణపతి మంత్రములు, ఆరాధనలు కలి ప్రభావానికి లోనుకాకుండా విశేషమయిన ఫలితములు అందజేసేవి అని అర్ధం.
జాతకరీత్యా, గోచారరీత్యా రాహుగ్రహము వల్ల కలిగే ఆశాభంగదోషము, దుష్ఫలితాలు శాంతింపజేసుకొని శుభఫలాలు పొందుటకు
శ్రీ మహాకాళీ, మహా లక్ష్మి, మహా సరస్వతీ దేవతల త్రిశక్తి స్వరూపమయిన చండీమాత ఆరాధన ఉత్తమమయినది.
ఈ చండీ మాత ఆరాధనలో ఆత్యంత మహిమాన్వితమయినది మరియూ శక్తివంతమయినది 700 శ్లోకాలతో కూడిన చండీ సప్తశతీ పారాయణ.
చండీ సప్తశతీ పారాయణ ఆచరించుటవల్ల విద్యాప్రావీణ్యత, సదుద్యోగసిద్ధి, సత్సంతాన సిద్ధి, పరప్రయోగ దోష నివారణ, దాంపత్య సఖ్యత, రోగబాధా ఉపశమనం, ఆర్ధిక వ్యాపార లాభములు వివాహ యోగము వంటి అనేక శుభఫలాలు సిద్ధించును.
ఇక రాహు కేతువుల వల్ల కలిగే కాలసర్పదోషము కూడా ఈ పారాయణ మరియూ కలాపం వల్ల శాంతించును.
జాతకరీత్యా సప్త గ్రహములూ రాహు కేతువుల దిగ్బంధనానికి లోను అగుటను సర్పదోషముగా పరిగణిస్తారు. రాహు కేతువులు నీచములో ఉన్నప్పుడు కలిగే ఇబ్బందులను
కార్యాదులలో ఆలస్య, ఆశాభంగ దోషములను కూడా ఈ సప్తశతీ కలాపం శాంతింపజేయును.
ఈ దీక్ష ఆచరించుటకు త్రిరాత్ర, పాంచరాత్ర, నవరాత్ర విధానములు ముఖ్యముగా చెప్పబడినవి కాత్యాయనీ తంత్ర గ్రంధములో ఒక చండీ హోమం నిర్వర్తించాలి అంటే కనీసంగా
9 కి పైబడి సప్తశతీ పారాయణలు పూర్తి చేసి ఉండాలని స్పష్టముగా చెప్పబడింది.
సర్పదోషము నివారణ చేసుకొనుటకు కాళహస్తి వెళ్ళి రాహు, కేతు పూజ ఆచరించలేనివారు సైతం ఈ చండీ సప్తశతీ సంపూర్ణ హవనం ఆచరించి సత్ఫలితాలు పొందవచ్చు
(ఈ కలాపం ఆచరించేవారికి చెప్పబడిన నియమాలు)
సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని, స్నానము చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసుకుని స్నానము చేయాలి. రోజువారీ పూజలో భాగంగా ఆవునెయ్యి లేదా ఆవ నూనె లేదా నువ్వులనూనెతో ఎర్ర ఒత్తులు ఉపయోగించి దీపారాధన చేయాలి. అమ్మవారి పటము లేదా ప్రతిమకు పూజ చేసి తేనె నైవేద్యంగా చెల్లించాలి. పూజ పూర్తి అయిన తర్వాత దుం దుర్గాయ నమః అనే నామ మంత్రాన్ని 108 కి తక్కువ కాకుండగా జపం చేయవలెను. ఈ జపం సాయంత్రం స్నానము తర్వాత కూడా చేయవలెను. ఉదయం ఫలములు తినవచ్చు. శారీరక ధర్మాన్ని బట్టి అల్పాహారం తినవలిసివచ్చినా తప్పులేదు. మధ్యాహ్నం సాత్విక భోజనం చేయవలెను అంటే మితిమీరిన కారం ఉప్పు మసాలాలు పనికిరావు. కార్యక్రమం జరుగుతున్న రోజులలో ఉల్లి, వెల్లుల్లి, మునగకాయ, అల్లం ఉపయోగించరాదు. పంక్తి భోజనాలు చేయరాదు. ఒకవేళ తప్పని పరిస్థితిలో పెరుగు అన్నం తినవచ్చు. రజస్వలా భోజనాలు పనికిరావు దీక్షా కాలములో ఇంట్లో ఉండే స్త్రీలకు నెలసరి ఇబ్బందులు లేకుండగా చూసుకోవలెను. దీక్షా కాలము మధ్యలో ఇంట్లో ఉండే స్త్రీలకు నెలసరి ఇబ్బందులు కలిగితే వారిని వేరుగా ఉంచడం లేదా మరలా అడ్డు అయ్యాకా కార్యక్రమం పునః ప్రారంభం చేయడం మంచిది. దీక్షా కాలములో ప్రతీ రోజూ రాత్రిభాగములో అల్పాహారం మాత్రమే తినవలెను. మాలిన్యం అయిన మంచముపై నిద్రించరాదు. భూ శయనం ఉత్తమం. కార్యక్రమములో భాగంగా తొలిరోజు గణపతిపూజ , పుణ్యాహవాచనం, నవగ్రహ, దిక్పాలక పంచపాలక ఆవాహనలు, దీక్షా ధారణ, ఆచార్య ఋత్విక్ వరుణ ప్రదానము. త్రిశక్తి ఆరాధన, విద్యుక్త ఉపచార పూజలూ ఉండును. పారాయణలో భాగంగా పుస్తకపూజ, గురుధ్యానం శాప ఉద్ధారపురస్సరం, కవచం, అర్గళం, కీలకం, రాత్రి సూక్తం, దేవీ సూక్తం, దేవీ నవార్ణ మహా మంత్ర జపం సిద్ద కుంజికా స్తోత్రం తో పాటు 13 అధ్యాయాలతో 700 శ్లోకాలతో కూడిన సప్తశతీ పారాయణ ఉండును.
సప్తశతీ హోమం లో “ప్రతి శ్లోకంచ జుహుయాత్ పాయసం తిల సర్పిష” అనే ప్రమాణ అనుసారంగా 700 శ్లోకాలకు తెల్ల నువ్వులు, తెల్లావాలు గుడాన్నం లో కలిపి ఆహుతులు సమర్పిస్తారు. 13 ఆధ్యాయాలకు 13 ప్రత్యేక ద్రవ్యాలను మహాహుతులుగా సమర్పిస్తారు.
అవి వెలగ, కొబ్బరి. విప్ప పువ్వు, పోకకాయ, జామ, కొబ్బరి, గుమ్మడి, చెరకు, గుమ్మడి+చెరకు, మాదీఫలము, దానిమ్మ, మారేడు, అరటిపండు వీటిని మహాహుతులు అంటారు.
వీటిని వినియోగిస్తూ ప్రామాణిక విధులతో శాస్త్రోక్తంగా ఉన్నతులైన పండిత సహకారంతో హోమ కార్యక్రమం నిర్వహిస్తారు.
ఈ విధానాన్ని చండీ కలాపం అంటారు. ఇది ప్రారంభం చేశాకా 3 రాత్రులు గడిచి 4 వ రోజు హెూమం నిర్వహించే విధానం.
యాజమాని 4 రోజులు సూచించిన నియమాలు పాటించాలి. ఈ హోమ ప్రభావం 3 సంవత్సరాలు ఉంటుంది. ఇది అనుభవపూర్వకమైన అభిప్రాయం మాత్రమే.
ఈ కలాపం సర్వత్రా మూఖాభివృద్ధినీ ఉన్నతత్వాన్నీ ప్రసాదిస్తుంది. ఇది మూలమంత్ర హోమం కన్నా 9 రెట్లు అధిక ప్రభావశాలి.
ఈ హోమం అభీష్ట దివసాలలో ఆచరించుకోవచ్చు.
ఆసక్తులు నమోదు చేసుకొనుటకు క్కిక్ చేయండి.
చండీ హోమములో మరొక విధానం చండీ మూల మంత్ర ఆజ్య హోమం: సప్తశతీ కలాపం ఆచరించుటకు వెసులుబాటు లేనివారు చండీ మూలమంత్ర ఆజ్య హోమం ఆచరించవచ్చు. చండీ మూలమంత్ర హెూమం ఒక ముహూర్త కాలాధికం గా ఉంటుంది. ఈ హెూమం లో ఆజ్యము గుడాన్నం (బెల్లంతో వండిన అన్న పదార్థం) వినియోగిస్తారు. ఈ హోమం అభీష్ట దివసాలలో ఆచరించుకోవచ్చు. ఆసక్తులు నమోదు చేసుకొనుటకు క్కిక్ చేయండి.