హోమాలు

సింహీ అపరాజితా మహా మంత్రాలయంలో వివిధ రకాల హోమాలు నిర్వహిస్తారు. హోమం అనేది పవిత్రమైన అగ్నిలో వివిధ ద్రవ్యాలను సమర్పించే ఒక ఆధ్యాత్మిక క్రతువు. హోమం చేయడం ద్వారా దేవతలను ప్రసన్నం చేసుకోవచ్చు మరియు శుభ ఫలితాలను పొందవచ్చు.

మా మంత్రాలయాన్ని సంప్రదించి, మీ అవసరాలకు తగిన హోమాన్ని బుక్ చేసుకోండి.

శక్తిని వికేంద్రీకరణ చేసి చైతన్యముగా మార్చి దేవీ దేవతలకు అందించే ప్రక్రియల్లో హోమం అత్యున్నతమైనది. ‘దేవానాం ఆజ్యం ఆహారం’ అంటే దేవతలకు హోమములో సమర్పించే నెయ్యి ప్రీతి పాత్రమైన ఆహారం అని అర్థం, దానితో పాటు నేతిలో వేయించిన బియ్యంతో వండిన హవిస్సు అనే అన్నపదార్ధం కూడా అత్యంత పవిత్రమైన ద్రవ్యం. దానినే దేవీ దేవతలు ఆహారంగా స్వీకరిస్తారని శాస్త్రం తెలియజేస్తోంది.

మనం ఒక మంచి ఆహార పదార్థాన్ని సిద్ధపరచాలంటే అందులో ఉపయోగించే వనరుల నాణ్యత ఎంత ముఖ్యమో.. హోమంలో ఉపయోగించే పదార్థాల నాణ్యత కూడా హవన సాద్యుణ్యతకు ముఖ్యం. హోమకుండము, దేవతా విగ్రహాలు లోపల ఖాళీగా గుల్లగా ఉండరాదు, కానీ మనం ఏం చేస్తున్నాం.. ఇనుము, రాగి వంటి లోహాలతో చేసిన గుల్లగా లోపల ఖాళీగా ఉన్న కుండాలు అద్దెకు తెచ్చుకుని హోమాలు నిర్వహిస్తున్నాం.. సూచించిన విధంగా హోమాలు కలాపాలు ఆచరిస్తే ఫలితాలు ఎందుకురావు..?

మన సౌకర్యానుసారం పద్ధతులు మార్చి కుండాలకు ప్రమాణాలు లేకుండా హోమాలు చేయడంవల్ల మధ్యమ ఫలితాలే వస్తాయి. ప్రామాణిక పద్ధతిలో హెూమాలు ఆచరించడం శ్రేయోదాయకం మరియూ శ్రేష్ఠం. సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరపున ఆసక్తులు శాస్త్రోక్తంగా హోమ ప్రాధాన్యతానుసారంగా షత్పాత్ర, చతుష్పాత్ర, లౌకిక, తాంత్రిక అగ్ని ప్రతిష్ఠాపనలతో పరిపూర్ణ అనుభవం కలిగిన పండిత సహకారంతో హోమాలు, కలాపాలు, ప్రకరణాలు నిర్వహించుకోవచ్చు. పీఠం తరఫున నిర్వహించే హెమాల వివరాలు వాటి నామోదుకు ఆయ్యే వ్యయం క్రింద పట్టికలో పొందుపరచబడ్డాయి. మీ అభీష్ట ప్రామాణిక హెూమానికి తగిన చెల్లింపు ముందుగానే పీఠానికి చేసి నమోదు చేసుకోగలరు.
సుదూరాలలో ఉండి హోమంలో ప్రత్యక్షంగా పాల్గోలేనివారకి హోమం జరిగే సమయంలో పీఠం నెంబర్ నుండి వీడియోకాల్ ద్వారా హోమం తిలకించే వెసులుబాటు కల్పించడం జరిగింది.

చండీ హోమం/కలాపం

కలౌ చండీ వినాయకః అంటే కలియుగంలో చండీ మరియూ గణపతి మంత్రములు, ఆరాధనలు కలి ప్రభావానికి లోనుకాకుండా విశేషమయిన ఫలితములు అందజేసేవి

Read More »

మహా గణపతి హోమం

మహా గణపతి మూలమంత్ర, అష్ట ద్రవ్య హోమము ఈ హోమాన్ని చాలామంది లక్ష్మి గణపతి హోమంగా అభివర్ణిస్తారు, కానీ ప్రామాణిక విధులలో

Read More »

మహా మృత్యుంజయ హోమం

మహా మృత్యుంజయ హోమం: త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం, ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీ యమామృతాత్ జీవికి తన జీవితంలో అత్యంత విలువైనది

Read More »

నవగ్రహ శాంతి హోమం

నవగ్రహ హోమం: ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ: హిందూ సనాతన జీవనంలో ప్రకృతితో

Read More »

రుద్ర హోమం

రుద్ర హోమం ఈశాన: సర్వ విద్యానాం ఈశ్వరస్సర్వ భూతానాం… సంకల్పించిన కార్యాలలో శివానుగ్రహం తోడైతే విజయమే వరిస్తుంది. సర్వ కామ్యప్రదం, సర్వ

Read More »