సప్తశతీ దీక్షా నియమాలు

  • సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని, స్నానము చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసుకుని స్నానము చేయాలి.
  • రోజువారీ పూజలో భాగంగా ఆవునెయ్యి లేదా ఆవ నూనె లేదా నువ్వులనూనెతో ఎర్ర ఒత్తులు ఉపయోగించి దీపారాధన చేయాలి.
  • అమ్మవారి పటము లేదా ప్రతిమకు పూజ చేసి తేనె నైవేద్యంగా చెల్లించాలి .
  • పూజ పూర్తి అయిన తర్వాత దుం దుర్గాయ నమః అనే నామ మంత్రాన్ని 108 కి తక్కువ కాకుండగా జపం చేయవలెను.
  • ఈ జపం సాయంత్రం స్నానము తర్వాత కూడా చేయవలెను.
  • ఉదయం ఫలములు తినవచ్చు. శారీరక ధర్మాన్ని బట్టి అల్పాహారం తినవలిసివచ్చినా తప్పులేదు.
  • మధ్యాహ్నం సాత్విక భోజనం చేయవలెను అంటే మితిమీరిన కారం ఉప్పు మసాలాలు పనికిరావు
  • కార్యక్రమం జరుగుతున్న రోజులలో ఉల్లి, వెల్లుల్లి, ములగకాయ, అల్లం ఉపయోగించరాదు.
  • పంక్తి భోజనాలు చేయరాదు. ఒకవేళ తప్పని పరిస్థితిలో పెరుగు అన్నం తినవచ్చు.
  • రజస్వలా భోజనాలు పనికిరావు, దీక్షా కాలములో ఇంట్లో ఉండే స్త్రీలకు నెలసరి ఇబ్బందులు లేకుండగా చూసుకోవలెను. లేదా మరలా అడ్డు అయ్యాకా కార్యక్రమం పునః ప్రారంభం చేయడం మంచిది.
  • దీక్షా కాలములో ప్రతీ రోజూ రాత్రిభాగములో అల్పాహారం మాత్రమే తినవలెను.
  • మాలిన్యం అయిన మంచముపై నిద్రించరాదు. భూ శయనం ఉత్తమం.
  • ప్రతీ రోజూ సాయంత్రం గృహమునందు దీపారాధన అష్ట లక్ష్మి కటాక్షానికి సోపానము.
  • కార్యక్రమములో భాగంగా తొలిరోజు గణపతిపూజ, పుణ్యాహవాచనం, నవగ్రహ, దిక్పాలక, పంచపాలక ఆవాహనలు, దీక్షా ధారణ, ఆచార్య ఋత్విక్ వరుణ ప్రదానము, త్రిశక్తి ఆరాధన, విద్యుక్త ఉపచార పూజలూ ఉండును.
  • పారాయణలో భాగంగా పుస్తకపూజ, గురుధ్యానం శాప ఉధ్ధారపురస్సరం, కవచం, అర్గళం, కీలకం, రాత్రి సూక్తం, దేవీ సూక్తం, దేవీ నవార్ణ మహా మంత్ర జపం, సిధ్ధ కుంజికా స్తోత్రం తో పాటు 13 అధ్యాయాలతో 700 శ్లోకాలతో కూడిన సప్తశతీ పారాయణ ఉండును. అహం
— అహం కమలానందనాధ
Categories

Follow Us

Leave a Reply