చండీ సప్తశతీ కలాప పూజా విధానము

కలౌ చండి వినాయకః అంటే కలియుగంలో చండి మరియూ గణపతి మంత్రములు,
ఆరాధనలు కలి ప్రభావానికి లోనుకాకుండా విశేషమయిన ఫలితములు అందజేసేవి అని అర్ధం. జాతకరీత్యా, గోచారరీత్యా రాహుగ్రహము వల్ల కలిగే ఆశాభంగదోషము, దుష్ఫలితాలు శాంతింపజేసుకుని శుభఫలాలు పొందుటకు శ్రీ మహాకాళీ, మహా లక్ష్మి, మహా సరస్వతీ దేవతల త్రిశక్తి స్వరూపమయిన చండీమాత ఆరాధన ఉత్తమమయినది.
ఈ చండీ మాత ఆరాధనలో అత్యంత మహిమాన్వితమయినది మరియూ శక్తివంతమయినది 700 శ్లోకాలతో కూడిన చండీ సప్తశతీ పారాయణ.

చండీ సప్తశతీ పారాయణ ఆచరించుటవల్ల విద్యాప్రావీణ్యత, సదుద్యోగసిద్ధి, సత్సంతాన సిధ్ధి పరప్రయోగ దోష నివారణ, దాంపత్య సఖ్యత, రోగబాధా ఉపశమనం, ఆర్ధిక వ్యాపార లాభములు వివాహ యోగము వంటి అనేక శుభఫలాలు సిద్ధించును. ఇక రాహు కేతువుల వల్ల కలిగే కాలసర్పదోషము కూడా ఈ పారాయణ మరియూ కలాపం వల్ల శాంతించును.

జాతకరీత్యా సప్త గ్రహములూ రాహు కేతువుల దిగ్బంధనానికి లోను అగుటను సర్పదోషముగా పరిగణిస్తారు, రాహు కేతువులు నీఛములో ఉన్నప్పుడు కలిగే ఇబ్బందులను కార్యాదులలో ఆలస్య ఆశాభంగ దోషములను కూడా ఈ సప్తశతీ కలాపం శాంతింపజేయును. ఈ దీక్ష ఆచరించుటకు త్రిరాత్ర, పాంచరాత్ర, నవరాత్ర విధానములు ముఖ్యముగా చెప్పబడినవి కాత్యాయనీ తంత్ర గ్రంధములో ఒక చండీ హెూమం నిర్వర్తించాలి అంటే కనీసంగా 9 కి పైబడి సప్తశతీ పారాయణలు పూర్తి చేసి ఉండాలని స్పష్టముగా చెప్పబడింది.

సర్పదోషము నివారణ చేసుకొనుటకు కాళహస్తి వెళ్ళి రాహు, కేతు పూజ ఆచరించలేనివారు సైతం ఈ చండీ సప్తశతీ సంపూర్ణ హవనం ఆచరించి సత్ఫలితాలు పొందవచ్చు.

జగన్మాతార్పణం
— అహం కమలానందనాధ
Categories

Follow Us

Leave a Reply