మహా మృత్యుంజయ హోమం: త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం, ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీ యమామృతాత్ జీవికి తన జీవితంలో అత్యంత విలువైనది ప్రాణం మాత్రమే. అదే ఉంటే ఏదైనా పొందే ప్రయత్నం చేయవచ్చు. ప్రాణానికి భద్రత కలిగించే మంత్రరాజాలలో మృత్యుంజయం చాలా గొప్పది. అసంకల్పిత రోగ రుజనాలనుండీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఈ మహా మృత్యుంజయ హవనం ఆచరించవచ్చు. ఈ హెూమం ఆచరించడానికి పూర్వం కనీసంగా దశ సహస్రాధిక మృత్యుంజయ జపం ఆచరించి తరువాత హోమం ఆచరించడం ఉత్తమ ఆశిత ఫలితాలను ప్రసాదిస్తుంది. మనకు ముఖ్యులు ప్రాణాపాయ స్థితి లో ఉన్నప్పుడు కూడా ఒక బ్రహ్మగారి సహకారంతోఈ విధానం ఆచరించవచ్చు. శివానుగ్రహం తోడైతే ప్రాణం నిలుస్తుంది. వాత, పిత్త, కఫ, శ్లేష్మ రోగ నివృత్తికి కూడా మృత్యుంజయం ఆచరించవచ్చు. మన జీవితంలో ఉన్న కామ్యాలను సాధించుకోడానికి అనేక విధానాలను శాస్త్రాలు తెలియజేసినప్పటికీ అన్నిటికన్నా విలువైన ప్రాణ సంరక్షణకు మాత్రం ప్రామాణికంగా చెప్పబడిన విధానమే మహా మృత్యుంజయం జప యుక్త హోమం.. జాతకరీత్యా, గోచారరీత్యా సూచిత మారణహేతు స్థితిని నిలువరించే లక్షణం మహా మృత్యుంజయానికి మాత్రమే కలదు.
సాధారణ మృత్యుంజయ హోమం: ఈ విధానం లో గణపతి పూజ, లౌకికాగ్ని ప్రతిష్ఠాపన, అష్టోత్తర సహస్ర సంఖ్యాధిక మృత్యుంజయ వైదిక మంత్ర జపం సహస్రాధిక మృత్యుంజయ వైదిక మంత్ర హోమం మహా పూర్ణాహుతి అనే క్రమాలు ఉంటాయి. సుమారు 2గంటల సమయం ఈ హెూమం నిర్వర్తించడానికి పడుతుంది.. నమోదు చేసుకొనుటకు…
మహా మృత్యుంజయ పాశుపత హెూమం : ఈ విధానం లో మొదటిరోజు గణపతి పూజ, లౌకికాగ్ని ప్రతిష్ఠాపన, తిల మండల మధ్యస్థ మహా మృత్యుంజయ ఆవాహన, దిక్పాల ఆవాహన ఆరాధన వరుణప్రదానం మహా మృత్యుంజయ జపం నిర్వర్తించబడతాయి. 2 వరోజు గణపతి పూజ, మండవ పున: పూజలు మహా మృత్యుంజయ జపం నిర్వర్తించబడతాయి. ఇక 3వ రోజు గణపతి పూజ, మండప పునః పూజలు మహా మృత్యుంజయ వైదిక మంత్ర హెూమం మహా పూర్ణాహుతి అనే క్రమాలు ఉంటయి. సుమారు మూడు గంటల సమయం ఈ హోమం నిర్వర్తించడానికి పడుతుంది.. నమోదు చేసుకొనుటకు…
