
పూర్ణిమ చండీ హోమం
సింహీ అపరాజితా మహా మంత్రాలయం లో ప్రతి మాసం పూర్ణిమ రోజున మీ గోత్ర నక్షత్ర నామాలతో సామూహిక చండీ హోమం
సింహీ అపరాజితా మహా మంత్రాలయానికి స్వాగతం. ప్రామాణిక శ్రీక్రమ శాస్త్ర విధానాలను సమగ్రంగా నేర్పే ఒక పాఠశాల లాంటిది ఈ విభాగం . మంత్ర శాస్త్రం ఒక రక్షణా వ్యవస్థ. ఈ శాస్త్రం ఆసక్తి కలిగిన వారు ఎవరైనా నేర్చుకోవచ్చు. ఈ విభాగంలో కుల, వర్ణ, లింగ, వయో భేదాలు లేవు. సాధకుల శ్రద్ధను దృష్టిలో పెట్టుకుని వారికి శాస్త్ర విలువలను సంపూర్ణంగా నేర్పాలనేది ఈ పీఠం యొక్క ఉద్దేశ్యం. మంత్ర శాస్త్రంలో లోతైన విషయాలను తెలియజేస్తూ సక్రమంగా సాధన ఎలా చేయాలో వ్యక్తిగతంగా అభ్యసింపచేసే ఏకైక పీఠమే సింహీ అపరాజితా మహామంత్రాలయం. శాస్త్ర విలువలను దిగజార్చే స్వార్థపరుల కబంధ హస్తాల నుండి శాస్త్ర విలువలను, ఔన్నత్యాన్ని రక్షిస్తూ నిజమైన మంత్రశాస్త్ర సాధనా పద్ధతులను ఈ విభాగంలో విద్యార్ధులు నేర్చుకోవచ్చు.
ఈ విభాగం శాస్త్ర శోధకులకు సరైన మార్గదర్శనం చేస్తూ అవసరం అయినప్పుడు ప్రత్యక్షంగా, పరోక్షంగా వారి సందేహాలను నివృత్తి చేస్తూ వారి సాధనకు సహకరిస్తుంది. ఈ విభాగం 2012 ఆగస్టు 6న ప్రారంభమై సుమారు తొమ్మిది సంవత్సరాలు వివిధ క్షేత్రాలలో విద్యార్థులకు ఉచిత శాస్త్ర విద్య, పోషణ గావించి అనేకులైన శాస్త్ర సాధకులకు సన్మార్గాన్ని ఒసగింది. ఈ విభాగం మొత్తం కమలానందనాధ దీక్షా నామాంకితులు బ్రహ్మశ్రీ ఆకెళ్ళ వీర వెంకట సత్యనారాయణ మూర్తి శర్మ గారి ఆధ్వర్యంలో వారి పర్యవేక్షణలో నిర్వహించబడుతోంది. సుమారు 2 సంవత్సరాలు అరుణాచలంలో ఈ సేవలు నిర్వహించి సుస్థిరంగా పీఠాన్ని అభివృద్ధి చేసేందుకు భాగ్యనగరంలో టీ. ఎంజాల్ గ్రామంలో శరవణ భవాలయ ఆలయ నిర్మాణంలో ప్రధానసలహాలు అందించి అదే ఆలయాన్ని ఆశ్రయించి నిర్వహించబడుతోంది. సింహీ అపరాజితా మహా మంత్రాలయ మంత్ర శాస్త్ర విభాగాన్ని ఎంచుకున్నందుకు ధన్యవాదాలు.
సింహీ అపరాజితా మహా మంత్రాలయం శిశు జనన ముఖావలోకన శాంతి నుండి వివాహ ఉపనయనాల వరకు అన్నీ వైదిక కార్యక్రమాలు నిర్వహించే సమర్ధత కలిగిన విభాగం. మీ గృహం లో నిర్వహించుకొదలిచిన వైదిక కార్యక్రమాలకు సైతం బ్రహ్మ, పండిత సహకారం నుండి అన్నీ సేవలు నిర్వహించడానికి నెలకొల్పబడింది. ఇతర వివరాలకు పీఠం నెంబర్ (+91 9505090595) వాట్సప్ పై సంప్రదించగలరు .
సింహీ అపరాజితా మహా మంత్రాలయానికి స్వాగతం. నేను కమలానందనాథ దీక్షానామాంకిత పూర్ణదీక్షితుడను. శ్రీవిద్యపై అచంచల భక్తి విశ్వాసాలతో, ఆసక్తితో, నమ్మకంతో శ్రీవిద్యాంకములైన పూర్వవిద్యాక్రమం, ఉత్తరవిద్యాక్రమం, గురుత్రయ పాదుకాంతం, మహావిద్యాక్రమం పంచదశి, షోడశీ విద్యలు గ్రహించి, పురశ్చరణ ఒసగి, పూర్ణాభిషిక్తం గావించబడి పరదేవత కృపచే శాస్త్ర శోధనా జీవనం సాగిస్తున్నాను.
సింహీ అపరాజితా మహా మంత్రాలయ విభాగం ప్రారంభించబడిన మొదటి పుష్కర కాలంలోనే శతాధిక శ్రీవిద్యాన్వేషకులను స్వాగతించి వారినుండీ ఏరకమైన లాభాపేక్షా కాంక్షించకుండా కేవలం ఉపదేశాలే కాకుండా సాధనాకాలంలో వారి వెన్నంటి ఉండి విభాగంలో ఉన్నతులుగా తీర్చిదిద్దింది. ఒక సాధకుడికి విద్యతో పాటు విద్యా వినియోగం తప్పనిసరి.
కాలమాన అనుసారంగా ఈ విభాగం భవిష్య తరాలకు విద్యా విలువలు చేరవేసేందుకు విభాగ పటుత్వానికి కొన్ని ఆర్జిత సేవలను రూపొందించడం జరిగింది.
ఒక గురువు ద్వారా మంత్ర గ్రహణ చేయాలి అనుకున్నప్పుడు స్వగురు, పరమగురు, పరమేష్టి గురువుల వివరాలు ఖశ్చితంగా తెలుసుకుని ఉండాలి. అది ఉత్తమ విధిగా శాస్త్రం తెలియజేసింది.
సింహీ అపరాజితా మహా మంత్రాలయానికి స్వాగతం. భౌతిక శరీరానికి వ్యాయామం ఎంత ముఖ్యమో…. ఆంతరంగికమైన ఆత్మకు జపసాధన అంతే ముఖ్యం. వ్యాయామం శరీరానికి స్థిరమైన ఆకృతిని, పటుత్వాన్నీ కలగజేస్తే.. జపసాధన ఆత్మకు మానసిక పరిపక్వత, సక్రమ ఆలోచనా విధానం, కార్యదక్షత ఒసగుతుంది. మనల్నీ మన కుటుంబాన్ని, మన పరివారాన్నీ, చెడు వ్యక్తులనుండీ, చెడుశక్తులనుండీ రక్షించుకోడానికి మంత్రశాస్త్ర సాధన ఒక బ్రహ్మాస్త్ర కవచంలా పనిచేస్తుంది. దాన్ని సక్రమంగా అభ్యసించినపుడు మాత్రమే ఆఫలితం ప్రాప్తిస్తుంది. చాలా మంది మంత్రాలని పరోక్షం గా గ్రహించడం లేదా అసంపూర్ణంగా న్యాసాలు, ధ్యాన శ్లోకాలు లేకుండా గ్రహించడం చేస్తారు. అవి సత్ఫలితాలను ఇవ్వకపోగా కొంతకాలానికి మంత్రశాస్త్రంపై పలు అనుమానాలకు తావునిస్తుంది. మంత్ర గ్రహణ ఒక వైదిక కర్మలాగా పవిత్రమైన క్రియ. దాన్ని చాలామంది వారి స్వార్ధప్రయోజనాలకు బలి చేశారు. శాస్త్రం అభ్యసించడానికి శ్రధ్ధ, పట్టుదల, నమ్మిక, ఓర్పు ఉంటే చాలు కుల ప్రస్తావన లేదు. సింహీ అపరాజితా మహా మంత్రాలయం మంత్రశాస్త్ర అభ్యాస విభాగాలలో అందరూ సమానమే.. కుల ప్రాధాన్యత లేదు అని గమనించగలరు. ఆసక్తి కలిగి శాస్త్ర అధ్యయన శోధన చేయాలనుకునే వారు ఈ వార్షిక సభ్యత్వంలో ప్రవేశించవచ్చు
సింహీ అపరాజితా మహా మంత్రాలయం లో ప్రతి మాసం పూర్ణిమ రోజున మీ గోత్ర నక్షత్ర నామాలతో సామూహిక చండీ హోమం
చండీ సప్తశతి , మహా విద్యా , అంగిర ఋక్ పారాయణా క్రమాలు సుందరకాండ , అరుణ పారాయణలు తత్సంబంధిత కార్యక్రమాలు
జాతకరీత్యా , గోచార రీత్యా గ్రహ పాలనలో ఉన్న దోష నివృత్తికి అనుభవజ్ఞులైన పండిత సహకారంతో నవగ్రహ జపాలు మరియూ సంపూర్ణ
సింహీ అపరాజితా మహా మంత్రాలయం వార్షిక సభ్యత్వంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించి, మంత్ర శాస్త్ర పురోగతిలో భాగస్వామ్యులుకండి.
మీకు ఏవైనా సందేహాలు, ప్రశ్నలు లేదా సహాయం అవసరమైతే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
WhatsApp us