సింహీ అపరాజితా మహా మంత్రాలయం లో ప్రతి మాసం పూర్ణిమ రోజున మీ గోత్ర నక్షత్ర నామాలతో సామూహిక చండీ హోమం ప్రత్యక్ష ద్రవ్యాలతో నిర్వహించబడుతుంది .
ఈ సామూహిక కార్యక్రమం లో ప్రత్యక్షంగా పాల్గొని ఆచరించే అవకాశం లేదు . కేవలం పరోక్ష విధానం అని గమనించగలరు . ఇది సామాన్యులు ఆర్ధికంగా ఎక్కువ ధనం వెచ్చించనవసరం లేకుండా అమ్మవారి సేవలో మా వొంతుగా పాల్గొనాలి అనుకునేవారికోసం ప్రత్యేకమైనది .
వార్షిక చందాదారులు పది నెలలకు చెల్లించి 12 మాసాలు ఈ సేవను పొందవచ్చు. పూర్ణిమ తరువాత హోమ ప్రసాదాలు వారికి ప్రతి మాసం కొరియర్ చేయబడతాయి. మధ్యస్తంగా పాల్గొనే వారు ఒకవేళ ఆలయానికి సమీపంలో ఉన్నవారైతే ఆలయానికి వచ్చి హోమ ప్రసాదాలు గ్రహించవచ్చు. ఒక నెల మాస చండీ హోమం లో గోత్ర నామాలతో సంకల్పించి ఆచరించే ఉద్దేశ్యం ఉన్నవారు పీఠానికి 1000/- ( వెయ్యి ) రూ. చెల్లించి నమోదు చేసుకోవచ్చు. వార్షిక చండీ సభ్యత్వం కొరకు 10 మాసాల చెల్లింపు 10 వేలు ఏకకాలంలో పీఠానికి చెల్లించవలెను.